Land For Jobs Scam Case | ఈడీ దూకుడు.. లాలూ నివాసంలో తనిఖీలు.. ఢిల్లీ, ముంబయిలోనూ.. సోదాలు..!

Land For Jobs Scam Case | ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై దర్యాప్తు సంస్థలు కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇటీవల ఆయనను సీబీఐ విచారించిన విషయం విధితమే. తాజాగా ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కుంభకోణంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ముంబయి, పాట్నాలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. […]

Land For Jobs Scam Case | ఈడీ దూకుడు.. లాలూ నివాసంలో తనిఖీలు.. ఢిల్లీ, ముంబయిలోనూ.. సోదాలు..!

Land For Jobs Scam Case | ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై దర్యాప్తు సంస్థలు కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇటీవల ఆయనను సీబీఐ విచారించిన విషయం విధితమే. తాజాగా ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌ కుంభకోణంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ముంబయి, పాట్నాలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోనే 15చోట్ల తనిఖీలు జరుపుతున్నారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురుతో పాటు మాజీ ఎమ్మెల్యే అబు దోజన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.

ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణంలో కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మెడకు కుంభకోణం ఉచ్చు బిగుసుకుంటోంది. గత రెండు రోజుల కిందట ఇదే కేసులో సీబీఐ ఆయన విచారించిన విషయం తెలిసిందే. కేసు వివరాల్లోకి వెళితే.. 2004-09 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో ఉద్యోగాలకు బదులుగా.. భూములు తీసుకున్నట్లుగా లాలూపై ఆరోపణలున్నాయి. ముంబయి, జబల్‌పూర్, కోల్‌కత్తా, జైపూర్, హాజీపూర్‌లలో పలువురికి గ్రూప్‌-డీ పోస్టులను అభ్యర్థులకు ఇచ్చి.. వారిని నుంచి భూములను లాలూ తన కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నట్లు ఈడీ ఆరోపిస్తున్నది.