Land Prices Increase | ఏపీలో భూముల ధరలు పెంపు.. ఖజానాకు ఆదాయం పెంచడమే లక్ష్యం
Land Prices Increase విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంలో భాగంగా భూముల ధరలను జూన్ ఒకటో తేదీ నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాంతాలను బట్టి ఈ పెంపు 10 నుంచి 30 శాతం వరకూ ఉంది. బాగా డిమాండ్ ఉండే ప్రాంతాల్లో ఈ పెంపు దాదాపు యాభై శాతం ఉండబోతోంది. ఇక త్వరలో ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఎకనామిక్ జోన్( ఎస్ఈజడ్) దగ్గర్లోని భూముల ధరలు […]

Land Prices Increase
విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంలో భాగంగా భూముల ధరలను జూన్ ఒకటో తేదీ నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాంతాలను బట్టి ఈ పెంపు 10 నుంచి 30 శాతం వరకూ ఉంది. బాగా డిమాండ్ ఉండే ప్రాంతాల్లో ఈ పెంపు దాదాపు యాభై శాతం ఉండబోతోంది.
ఇక త్వరలో ఏర్పాటు చేస్తున్న స్పెషల్ ఎకనామిక్ జోన్( ఎస్ఈజడ్) దగ్గర్లోని భూముల ధరలు దాదాపు 75 శాతం పెరగనున్నాయి. కోవిద్ కారణంగా మూడేళ్ళుగా ఈ ధరల్లో మార్పులు చేయలేదని, కానీ ఇప్పుడు మారుస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కక్షిదారులు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది.
ఇదిలా ఉండగా గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ సమీప ప్రాంతాలను కోర్ ఏరియాగా ప్రభుత్వం గుర్తిస్తోంది. అంటే ఈ ప్రాంతాల్లో భూముల ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సాధారణంగా రోజుకు ఆరేడువేల లావాదేవీలు ఆంధ్రాలో జరుగుతాయి కానీ కొన్ని ముఖ్యమైన దినాలు, శుభదినాల్లో ఆ సంఖ్య రెట్టింపు ఉంటుంది.
వాస్తవానికి ఏపీ గవర్నమెంట్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 8500 కోట్లు ఆదాయం సమీకరించింది. ఇప్పుడు భూముల రేట్లు పెంచడంతో ఆ ఆదాయం మరింత పెరుగుతుది. జూన్ ఒకటి నుంచి కొత్త ధరలు అమ్మల్లోకి వస్తాయి.
ప్రస్తుతం ఏపీలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి 7. 5 శాతంగా ఉన్నాయి. అంటే వంద రూపాయల ఆస్తిని కొనుగోలు చేసినవారు ప్రభుత్వానికి రూ. 7. 5 పన్నురూపేనా చెల్లించాలి అన్నమాట.