కాంగ్రెస్‌లోకి లాస్యనందిత సోదరి నివేదిత ?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత బీఆరెస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలుస్తుంది.

కాంగ్రెస్‌లోకి లాస్యనందిత సోదరి నివేదిత ?

విధాత, హైదరాబాద్‌: సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత బీఆరెస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకత్వం ఆమెతో సంప్రదించారని, ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.


నివేదితను కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించిన పక్షంలో బీఆరెస్ పార్టీ తన అభ్యర్థిని నిలబెడుతుందా లేక నివేదితకు మద్దతుగా ఏకగ్రీవానికి సహకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్‌లో నివేదిత చేరికపై అధికారిక సమాచారం వెలువడాల్సివుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది.