కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్‌ ఎంపిక

సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయన్‌ శ్రీ గణేశ్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్‌ ప్రకటించారు

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్‌ ఎంపిక

విధాత: సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయన్‌ శ్రీ గణేశ్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్‌ ప్రకటించారు. నారాయన్ శ్రీ గణేశ్‌ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆరెస్‌ సెట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ స్థానంలో ఉపఎన్నిక జరుగనుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక పోలింగ్ మే 13న జరుగనుంది.

ప్రేమించి, పెళ్లి చేసుకుందని.. బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేశ్‌ బీజేపీ నుంచి పోటీ చేసి 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా అమె 20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కంటోన్మెంట్ కోసం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగొలు నాలుగు సార్లు సర్వేలు చేయగా.. కంటోన్మెంట్‌లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో అదే అరవ మాల సామాజికవర్గంకు చెందిన గణేశ్‌ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపారు.

బీఆరెస్‌కు ఒక్క సీటు రాదు.. క‌రువుకు కార‌ణం బీఆరెస్సే గద్దర్ కూతురు వెన్నెలకు కాకుండా శ్రీ గణేశ్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లేనందున కంటోన్మెంట్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇక కంటోన్మెంట్‌లో బీఆరెస్, బీజేపీ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సివుంది.