విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్లలోని సిగ వీరయ్య వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఉదయం సంచరించిన జంతువు అడవి కుక్క అయి ఉండవచ్చని ఫారెస్ట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాదముద్రలు చిన్నవిగా ఉండడంతో చిరుత పులివి కాకపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
అడవి కుక్కలు కూడా ఇటువంటి కాలి గుర్తులను కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. కాగా తాను ప్రత్యక్షంగా చూసానని గ్రామానికి చెందిన బోడపట్ల ఎర్రయ్య అనే గీత కార్మికుడు పేర్కొంటున్నారు. కాగా ఈ పాదముద్రలను ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని, వారి అభిప్రాయం మేరకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.