Mahbubnagar ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రానున్న మూడేళ్లలో 30వేల ఉద్యోగాలు కల్పిస్తాం విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు జిల్లాలో డోకా లేదు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ విధాత: పర్యాటకపరంగా మహబూబ్ నగర్ జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని, రానున్న మూడు, నాలుగేళ్లలో పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 30 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. […]

- రానున్న మూడేళ్లలో 30వేల ఉద్యోగాలు కల్పిస్తాం
- విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు జిల్లాలో డోకా లేదు
- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్
విధాత: పర్యాటకపరంగా మహబూబ్ నగర్ జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని, రానున్న మూడు, నాలుగేళ్లలో పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 30 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థానంలో బస్టాండ్ ఎదురుగా 50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న టూరిజం బడ్జెట్ హోటల్, వ్యాపార సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ అంటేనే చిన్న చూపు ఉండేదని, అలాంటిది ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆశీస్సుల మేరకు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని అన్నారు.
మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు డివిటిపల్లి వద్ద ఐటి టవర్‌ను ప్రారంభించనున్నారని, దీని ద్వారా రానున్న మూడు, నాలుగేళ్లలో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, బతుకుదెరువు ఏర్పడుతుందని, వ్యాపార అభివృద్ధి అవుతుందని తెలిపారు. పాత కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతామని, పాత కలెక్టరేట్ ఆవరణలో 50 కోట్ల రూపాయలతో బడ్జెట్ హోటలతో పాటు, మంచి మంచి బ్రాండెడ్ షాపులు, ఐమాక్స్ థియేటర్ వంటివి నిర్మిస్తామని, రానున్న సంవత్సరంలోపే వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా వచ్చే 15 నెలల్లో బస్టాండ్ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరకు ఫూట్ ఓవర్ బ్రిడ్జిని కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. నెక్లెస్ రోడ్ వద్ద అదనంగా 50 కోట్ల రూపాయలతో ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మన్యంకొండలో 15 కోట్ల రూపాయలతో బడ్జెట్ హోటల్, 50 కోట్ల రూపాయలతో రోప్ వేను ఈ నెలలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను మన్యంకొండ పనులకు టెండర్లు ఈ వారంలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. బడ్జెట్ హోటల్ పనులను త్వరగా మొదలుపెట్టి వేగవంతం చేయాలని, అదేవిధంగా ఐటీ టవర్ నుండి మహబూబ్‌నగర్ వరకు మరో కొత్త రహదారి,మరో 100 ఫీట్ల రహదారి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్ అన్ని కలిసిపోతాయన్నారు.
ఐటి టవర్లో పెద్ద పెద్ద పరిశ్రమల వల్ల రానున్న మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు. దీని తర్వాత భూత్పూర్ పరిసర ప్రాంతాలలో సైతం మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను నెలకొల్పనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లా నుండి వలస వెళ్లినవారు ఇప్పుడు తిరిగి వస్తున్నారని, జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల తో పాటు, మైనార్టీ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చాయన్నారు. విద్య, వైద్యం, వ్యాపార రంగాలకు జిల్లాలో డోకా లేదని, అభివృద్ధి విషయంలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా మహబూబ్ నగర్ ను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తాను పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్పకు ప్రపంచ వారసత్వం గుర్తింపు వచ్చిందని, పోచంపల్లి ప్రపంచ స్థాయిలో రూరల్ టూరిజం విలేజ్ గా ఎంపికైందని, కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం తో పాటు, యువజన సర్వీసుల శాఖ ద్వారా 30 వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్, రాష్ట్ర పర్యటకశాఖ ఎండి మనోహర్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యా నాయక్, స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, పర్యాటక శాఖ సీఈ వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, పర్యాటకశాఖ డిప్యూటీ ఇంజనీర్ పరుష వేది, అసిస్టెంట్ ఇంజనీర్ మధు, పర్యాటకశాఖ అధికారి యు. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.