లింగాష్టకం.. అర్థం తెలుసుకొని చదివారా ఎప్పుడైనా..? లేదా
విధాత: లింగాష్టకాన్ని మహాశివుడి సన్నిధిలో చదవగలిగితే అంతకన్న మహదావకాశం మరోటి లేదు. అలాంటిది మహాశివరాత్రి పర్వదినాన లింగాష్టకాన్నిఇంట్లో లేదా గుడిలో విన్నా చదివినా ఆ ముక్కంటి చూపు పడి ధన్యులమవుతాము. అంతటి మహిమాన్వితమైన లింగాష్టకాన్ని అర్థంతో సహా చదివి తరిద్దాం.. బ్రహ్మమురారి సురార్చిత లింగం బ్రహ్మ, విష్ణు దేవతల చేత పూజలందుకున్న లింగం.. నిర్మలభాసిత శోభిత లింగం నిర్మలమైన మాటల చేత అలంకృతమైన లింగం జన్మజదుఃఖ వినాశక లింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే […]

విధాత: లింగాష్టకాన్ని మహాశివుడి సన్నిధిలో చదవగలిగితే అంతకన్న మహదావకాశం మరోటి లేదు. అలాంటిది మహాశివరాత్రి పర్వదినాన లింగాష్టకాన్నిఇంట్లో లేదా గుడిలో విన్నా చదివినా ఆ ముక్కంటి చూపు పడి ధన్యులమవుతాము. అంతటి మహిమాన్వితమైన లింగాష్టకాన్ని అర్థంతో సహా చదివి తరిద్దాం..
బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మ, విష్ణు దేవతల చేత పూజలందుకున్న లింగం..
నిర్మలభాసిత శోభిత లింగం
నిర్మలమైన మాటల చేత అలంకృతమైన లింగం
జన్మజదుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం
దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు, మహారుషులతో పూజలు చేయబడిన లింగం
కామదహన కరుణాకర లింగం
మన్మథుడిని దహనం చేసిన, అపారమైన కరుణ చూపే చేతులు గల లింగం
రావణదర్ప వినాశక లింగం
రావణుడి గర్వాన్ని సర్వ నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
సర్వసుగంధి సులేపిత లింగం
అన్ని మంచి గంథాలు మంచిగా పూసిన శివలింగం
బుద్ధివవర్ధన కారణ లింగం
మనుషుల బుద్ధి వికాసానానికి తోడ్పడిన లింగం
సిద్ధసురాసుర వందిత లింగం
సిద్ధులు, దేవతలు, రాక్షసుల చేత కీర్తింపబడిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
కనక మహామణి భూషిత లింగం
బంగారం, మహామణుల చేత అలంకరించబడిన లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసం చేత అలంకృతమైన లింగం
దక్షసుయజ్ఞ వినాశన లింగం
దక్షుడు చేసిన యజ్ఞాన్నినాశనం చేసిన శివలింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
కుంకుమ చందన లేపిత లింగమ్
కుంకుమ, గంథము పూయబడిన లింగమ్
పంకజహార సుశోభిత లింగం
కలవల దండ చేత చక్కగా అలంకృతమైన లింగం
సంచితపాప వినాశక లింగం
సంక్రమించిన పాపాలను నాశనం చేసే శివలింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
దేవగణార్చిత సేవిత లింగమ్
దేవ గణాల చేత పూజలు, సేవలు అందుకున్న లింగం
భావైర్భక్తిభిరేవచ లింగమ్
చక్కటి భావంతో కూడిన భక్తితో పూజింపబడిన లింగం
దినకరకోటి ప్రభాకర లింగమ్
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్యబింబం లాంటి శివలింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
అష్టదళోపరి వేష్టిత లింగమ్
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివలింగం
సర్వసముద్భవ కారణ లింగమ్
సమస్త ప్రాణులు సమానంగా జన్మించడానికి కారణమైన శివలింగం
అష్టదరిద్ర వినాశన లింగమ్
ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివలింగం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
సురగురు సురవర పూజిత లింగమ్
దేవగురువు(బృహస్పతి), దేవతల చేత పూజింపబడ్డ శివలింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్
దేవతల తోటల్లో పూచే పువ్వుల(పారిజాతాలు) చేత నిత్యం పూజలందుకునే శివలింగం
పరమపదం పరమాత్మక లింగమ్
ఓ శివలింగమా.. నీ సన్నిధియే ఒక స్వర్గం
తత్ప్రణమామి సదాశివ లింగమ్
నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదా శివ లింగమా
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
లింగాష్టకాన్ని ఎప్పుడు, ఎవరు శివుడి సన్నిధిలో చదువుతారో వారికి చాలా పుణ్యం వస్తుంది
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే
అలాగే శివలోకం లభిస్తుంది. శివుడిలో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది.