పక్షి చేసిన పనికి.. అందరూ చూస్తుండగానే మీద పడ్డ హై వోల్టేజీ విద్యుత్ వైర్లు
Kharagpur railway station | ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని పెద్దలు చెప్పె నానుడి మరోసారి నిజం అయింది. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన అక్కడి వారిని భయ బ్రాంతులకు గురి చేసింది. ఓ పక్షి తన గూడు కోసం పుల్లలను చిన్న చిన్న విద్యుత్ తీగలను మోసుకెళ్తుండగా ఆవి అనుకోకుండా.. రైల్వేస్టేషన్‌లోని హై వోల్టేజీ విద్యుత్ వైర్లకు తగలడంతో అవి ఒక్కసారిగా తెగి ప్లాట్‌ఫామ్ […]
Kharagpur railway station | ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని పెద్దలు చెప్పె నానుడి మరోసారి నిజం అయింది. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన అక్కడి వారిని భయ బ్రాంతులకు గురి చేసింది.
ఓ పక్షి తన గూడు కోసం పుల్లలను చిన్న చిన్న విద్యుత్ తీగలను మోసుకెళ్తుండగా ఆవి అనుకోకుండా.. రైల్వేస్టేషన్‌లోని హై వోల్టేజీ విద్యుత్ వైర్లకు తగలడంతో అవి ఒక్కసారిగా తెగి ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఓ వ్యక్తిపై పడడంతో విద్యుత్ షాక్‌కు గురై పట్టాలపై పడిపోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) సుజన్ సింగ్ సర్దార్ మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో అక్కడి నుంచి ఓ పక్షి చిన్న చిన్న వైర్లను తీసుకెళ్తుండగా.. అవి హై వోల్టేజీ విద్యుత్ తీగలకు తగలడంతో ఆ తీగలు తెగి టీటీఈ మీద పడడంతో విద్యుత్ షాక్‌కు అతను గురై రైలు పట్టాలపై పడిపోయాడు.
దీంతో ఆయన తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమై చికిత్స నిమిత్తం టీటీని ఆస్పత్రికి తరలించారు. టీటీఈ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram