Viral Video | బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్లారు.. దీని వెనుకాల పెద్ద క‌థే ఉంది..!

Viral Video | బైక్‌ (Bike)లో ఏదైనా లోపం త‌లెత్తితే.. దాన్ని ఆటో (Auto)లో లేదా ఇత‌ర వాహ‌నాల్లో తీసుకెళ్ల‌డం చూశాం. కానీ బైక్‌ను మ‌రో బైక్‌పై తీసుకెళ్ల‌డం చూసి ఉండ‌రు. అది సాధ్య‌మ‌య్యే ప‌ని కూడా కాదు. కానీ వీరు బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. మ‌రి బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్ల‌డం వెనుక పెద్ద కథే ఉంది. ఆ ఆస‌క్తిక‌ర క‌థ గురించి తెలుసుకోవాలంటే మ‌హారాష్ట్ర‌ (Maharashtra) లోని ఔరంగాబాద్ […]

Viral Video | బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్లారు.. దీని వెనుకాల పెద్ద క‌థే ఉంది..!

Viral Video | బైక్‌ (Bike)లో ఏదైనా లోపం త‌లెత్తితే.. దాన్ని ఆటో (Auto)లో లేదా ఇత‌ర వాహ‌నాల్లో తీసుకెళ్ల‌డం చూశాం. కానీ బైక్‌ను మ‌రో బైక్‌పై తీసుకెళ్ల‌డం చూసి ఉండ‌రు. అది సాధ్య‌మ‌య్యే ప‌ని కూడా కాదు. కానీ వీరు బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్లి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. మ‌రి బైక్‌పై మ‌రో బైక్‌ను తీసుకెళ్ల‌డం వెనుక పెద్ద కథే ఉంది. ఆ ఆస‌క్తిక‌ర క‌థ గురించి తెలుసుకోవాలంటే మ‌హారాష్ట్ర‌ (Maharashtra) లోని ఔరంగాబాద్ (Aurangabad ) వెళ్లాల్సిందే.

ఔరంగాబాద్‌లోని వైజాపూర్‌ (Vaijapur)కు చెందిన ఓ వ్య‌క్తి.. ఓ ఫైనాన్స్ కంపెనీ (Finance Company) ద్వారా బైక్‌ను కొనుగోలు చేశాడు. కొన్ని నెల‌లు రుణం చెల్లించాడు. అయితే గ‌త కొద్ది నెల‌ల నుంచి స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీకి రుణం చెల్లించ‌ట్లేదు. దీంతో ఆ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వైజాపూర్ చేరుకుని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఆ ద్విచ‌క్ర వాహ‌నం స్టార్ట్ కాలేదు. దీంతో బైక్‌ను అక్క‌డే వ‌దిలేయ‌కుండా, తాము వ‌చ్చిన బైక్‌పైనే ఈ బైక్‌ను కూడా తీసుకెళ్లారు. వెనుకాల కూర్చున్న వ్య‌క్తి త‌న ముందు బైక్‌ను అడ్డంగా పెట్టుకోగా, మరో వ్య‌క్తి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాన్ని కొంద‌రు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించి, సామాజిక మాధ్య‌మాల్లో (Social Media) వైర‌ల్ చేశారు.