మరొకరితో నిశ్చితార్థం.. ప్రియుడికి విషమిచ్చి చంపేసిన ప్రియురాలు
విధాత: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పింది. కానీ ఆ అబ్బాయి తన ప్రియురాలిని మరిచి పోలేకపోయాడు. నిన్నే ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడ్డాడు. ఈ క్రమంలో తనకు మరొకరితో నిశ్చితార్థం జరగడంతో బాయ్ ఫ్రెండ్‌ను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని లవర్‌కు విషమిచ్చి చంపేసింది ప్రియురాలు. ఈ దారుణ కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగు చూసింది. ఒకే ఒక్కడు.. జనరంజకుడు… KA పాల్ వివరాల్లోకి వెళ్తే.. కేరళకు […]

విధాత: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పింది. కానీ ఆ అబ్బాయి తన ప్రియురాలిని మరిచి పోలేకపోయాడు. నిన్నే ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడ్డాడు. ఈ క్రమంలో తనకు మరొకరితో నిశ్చితార్థం జరగడంతో బాయ్ ఫ్రెండ్‌ను ఎలాగైనా వదిలించుకోవాలనుకుని లవర్‌కు విషమిచ్చి చంపేసింది ప్రియురాలు. ఈ దారుణ కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన గ్రీష్మ(22) తమిళనాడులోని ఓ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్ చదివింది. ఆమె గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే షరోన్(23) అనే యువకుడు ఆమెను ప్రేమించాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ కొనసాగింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రీష్మ షరోన్‌కు బ్రేకప్ చెప్పింది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. నిశ్చితార్థం కూడా జరిగింది.
అయినప్పటికీ షరోన్ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. వెంట పడుతూనే ఉన్నాడు. దీంతో ఎలాగైనా షరోన్ ను వదిలించుకోవాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్టోబర్ 14న గ్రీష్మ తన ఇంటికి షరోన్‌ను పిలిచింది. ఆయుర్వేదిక్ డికాషన్‌లో విషాన్ని కలిపి ఇచ్చింది. అది తాగిన షరోన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 25న కన్నుమూశాడు.
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా..? గట్టిగా అరిస్తే జరిమానా తప్పదు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఆదివారం రాత్రి గ్రీష్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని బాత్రూమ్‌లోకి వెళ్లి గ్రీష్మ పురుగుల మందు సేవించింది. అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం గ్రీష్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. షరోన్‌ను తానే చంపినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. మరో వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతోనే చంపానని తెలిపింది.