Madhukar | గౌడ్‌గా మారిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్.. తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి
Madhukar | అమ్మవారికి నైవేద్యం సమర్పించిన జెడ్పీ చైర్మన్ విధాత బ్యూరో, కరీంనగర్: సాధారణంగా గౌడ కులస్తులు మాత్రమే తాటి, ఈత చెట్టు ఎక్కి కల్లు గీస్తారు. కానీ ఇక్కడ మాత్రం జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గౌడ్‌గా మారి తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహముని కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయనను గౌడ కులస్తులు కులవృత్తి పరికరమైన మోకుతాడుతో సన్మానించారు. […]

Madhukar |
అమ్మవారికి నైవేద్యం సమర్పించిన జెడ్పీ చైర్మన్
విధాత బ్యూరో, కరీంనగర్: సాధారణంగా గౌడ కులస్తులు మాత్రమే తాటి, ఈత చెట్టు ఎక్కి కల్లు గీస్తారు. కానీ ఇక్కడ మాత్రం జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ గౌడ్‌గా మారి తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు.
రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహముని కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయనను గౌడ కులస్తులు కులవృత్తి పరికరమైన మోకుతాడుతో సన్మానించారు.
అనంతరం ఆయన తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. కళ్యాణ మహోత్సవం సందర్బంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆయన తాటి చెట్టు ఎక్కటి కల్లు గీసి తీసుకు వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తాటి చెట్టు ఎక్కి కల్లు గీయడం చూసి స్థానికులు అబ్బురపడ్డారు.