Madhya Pradesh | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ‌

ఎన్నిక‌ల్లో కొన్ని నెల‌ల ముందు మంత్రివ‌ర్గంలో ముగ్గురికి చోటు Madhya Pradesh | విధాత‌: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ స‌ర్కారు మంత్రి మండ‌లిని విస్త‌రించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌రో ముగ్గురికి శనివారం మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. కుల, ప్రాంతీయ స‌మీర‌ణ‌ల‌ను బ్యాలెన్స్ చేయ‌డంలో భాగంగా మంత్రివర్గాన్ని విస్తరించిన‌ట్టు తెలుస్తున్న‌ది. భోపాల్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం ముగ్గురు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్‌, రాహుల్ లోధితో గ‌వ‌ర్న‌ర్ మంత్రులుగా ప్ర‌మాణం […]

  • Publish Date - August 26, 2023 / 07:16 AM IST
  • ఎన్నిక‌ల్లో కొన్ని నెల‌ల ముందు
  • మంత్రివ‌ర్గంలో ముగ్గురికి చోటు

Madhya Pradesh | విధాత‌: మధ్యప్రదేశ్‌లోని బీజేపీ స‌ర్కారు మంత్రి మండ‌లిని విస్త‌రించింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు మ‌రో ముగ్గురికి శనివారం మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారు. కుల, ప్రాంతీయ స‌మీర‌ణ‌ల‌ను బ్యాలెన్స్ చేయ‌డంలో భాగంగా మంత్రివర్గాన్ని విస్తరించిన‌ట్టు తెలుస్తున్న‌ది.

భోపాల్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో శ‌నివారం ఉద‌యం ముగ్గురు రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్‌, రాహుల్ లోధితో గ‌వ‌ర్న‌ర్ మంత్రులుగా ప్ర‌మాణం చేయించారు. ముగ్గురు కొత్త మంత్రుల్లో రాజేంద్ర శుక్లా బ్రాహ్మణుడు కాగా, మరో ఇద్దరు – గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధి – ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కమ్యూనిటీకి చెందినవారు. వీరి చేరికతో ఇప్పుడు చౌహాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 34 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ సంఖ్య 35కి చేరవచ్చు.