Viral Video | పంద్రాగస్టు వేడుకలు.. సొమ్మసిల్లి పడిపోయిన స్పీకర్, హెల్త్ మినిస్టర్
Viral Video | దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్పీకర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర సమరయోధులకు పుష్పాంజలి ఘటించారు. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఆరోగ్య శాఖ మంత్రి.. పంద్రాగస్టు వేడుకల్లో సొమ్మసిల్లి పడిపోయారు. వారిద్దరికి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ హెల్త్ మినిస్టర్ ప్రభురాం చౌదరి.. రైజెన్ జిల్లాలో నిర్వహించిన ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం […]

Viral Video |
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, స్పీకర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర సమరయోధులకు పుష్పాంజలి ఘటించారు. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఆరోగ్య శాఖ మంత్రి.. పంద్రాగస్టు వేడుకల్లో సొమ్మసిల్లి పడిపోయారు. వారిద్దరికి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్ హెల్త్ మినిస్టర్ ప్రభురాం చౌదరి.. రైజెన్ జిల్లాలో నిర్వహించిన ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల పరేడ్ జరుగుతుండగా.. ఆయన వేదికపై నిల్చొని ఉన్నారు. అంతలోనే ఉన్నట్టుండి.. కింద పడిపోయారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అధికారులు.. ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడం కారణంగా చౌదరి స్పృహ కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీశ్ గౌతమ్.. మౌగంజ్ జిల్లాలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగిస్తూనే స్పీకర్ కుప్పకూలారు. దీంతో ఆయనను సిబ్బంది పట్టుకుని, చైర్‌లో కూర్చోపెట్టారు. అనంతరం స్పీకర్‌ను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
स्वतंत्रता दिवस समारोह में मंच पर गिरे स्वास्थ्य मंत्री
– शुगर लेवल हाई होने से बिगड़ी तबीयत
– कलेक्टर और एसपी लेकर पहुंचे अस्पताल pic.twitter.com/noPJLkvfeS— Nitinthakur (@Nitinreporter5) August 15, 2023