Viral Video | ప‌బ్లిక్‌లోనే సివిల్ ఇంజినీర్ చెంప ఛెళ్లుమ‌నిపించిన మ‌హిళా ఎమ్మెల్యే

Viral Video | ఓ మ‌హిళా ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అంద‌రూ చూస్తుండ‌గానే సివిల్ ఇంజినీర్ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. థానే జిల్లాలోని మీరా భ‌యంద‌ర్ ఎమ్మెల్యే గీతా భ‌ర‌త్ జైన్ ఓ ఇద్ద‌రు ఇంజినీర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీరా భ‌యంద‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొన్ని నిర్మాణాల‌ను నేల‌మ‌ట్టం చేశారు. దీంతో చిన్నారుల‌తో పాటు కొంద‌రు ఆక్ర‌మ‌ణ‌దారులు రోడ్డున ప‌డ్డారంటూ, వ‌ర్షాకాలంలో వారి ప‌రిస్థితి ఏంట‌ని ఎమ్మెల్యే […]

Viral Video | ప‌బ్లిక్‌లోనే సివిల్ ఇంజినీర్ చెంప ఛెళ్లుమ‌నిపించిన మ‌హిళా ఎమ్మెల్యే

Viral Video | ఓ మ‌హిళా ఎమ్మెల్యే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అంద‌రూ చూస్తుండ‌గానే సివిల్ ఇంజినీర్ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. థానే జిల్లాలోని మీరా భ‌యంద‌ర్ ఎమ్మెల్యే గీతా భ‌ర‌త్ జైన్ ఓ ఇద్ద‌రు ఇంజినీర్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీరా భ‌యంద‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొన్ని నిర్మాణాల‌ను నేల‌మ‌ట్టం చేశారు.

దీంతో చిన్నారుల‌తో పాటు కొంద‌రు ఆక్ర‌మ‌ణ‌దారులు రోడ్డున ప‌డ్డారంటూ, వ‌ర్షాకాలంలో వారి ప‌రిస్థితి ఏంట‌ని ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు. నిర్మాణాల‌ను ఎలా ధ్వంసం చేస్తారంటూ నిల‌దీశారు. అంత‌టితో ఆగ‌కుండా అంద‌రూ చూస్తుండ‌గానే ఓ సివిల్ ఇంజినీర్‌పై ఎమ్మెల్యే గీతా చేయి చేసుకున్నారు.

తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గీతా జైన్ గ‌తంలో బీజేపీ నుంచి మేయ‌ర్‌గా సేవ‌లందించారు. 2019 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఆమె బీజేపీ – శివ‌సేన ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ఉన్నారు.