Sitara Ghattamaneni | ప్రిన్సెస్ సితార.. మొత్తానికి వారసురాలు అనిపించుకుంటోంది!
Sitara Ghattamaneni ప్రౌడ్‌గా ఫీలవుతోన్న మహేష్ అండ్ ఫ్యాన్స్ విధాత: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మహేష్ కూతురు సితార విషయంలో మరోసారి నిజమైంది. తాత సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా ఆ జీన్స్ ఎక్కడికి పోతాయని ఈ పిల్ల టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అటు తండ్రి ప్రిన్స్ మహేష్ కూతురిగా సితార ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. దానికి తోడు సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ప్లస్ ఫాలోయర్స్ ఉన్నారు, తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ […]
Sitara Ghattamaneni
- ప్రౌడ్‌గా ఫీలవుతోన్న మహేష్ అండ్ ఫ్యాన్స్
విధాత: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మహేష్ కూతురు సితార విషయంలో మరోసారి నిజమైంది. తాత సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా ఆ జీన్స్ ఎక్కడికి పోతాయని ఈ పిల్ల టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అటు తండ్రి ప్రిన్స్ మహేష్ కూతురిగా సితార ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. దానికి తోడు సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ప్లస్ ఫాలోయర్స్ ఉన్నారు, తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది.
సితార చేసే వీడియోలు కూడా కాస్త భిన్నంగానే ఉంటాయి. తండ్రి మహేష్ సినిమాలకు సంబంధించిన సాంగ్స్‌కి డాన్స్ చేస్తూనో, లేక శాస్త్రీయ నృత్యం చేస్తూనో మంచి హుషారుగా వీడియోలను పోస్ట్ చేస్తుంది సితార. వీటితో పాటు అప్పుడప్పుడు, మహేష్ ఉన్న ఫోటోలను, ఫ్యామిలీ వీడియోలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఒక కమర్షియల్ జ్యూయెలరీ యాడ్‌లో నటించింది సితార. ఇందుకు గాను భారీ ఎమౌంట్ తీసుకున్నట్టు సమాచారం.

గతంలోనూ చాలా యాడ్స్‌లలో నటించే అవకాశాలు వచ్చినా మహేష్ ఇష్టపడ లేదు. తాజాగా చేసిన యాడ్ మాత్రం కోటి రూపాయల భారీ ఎమౌంట్‌తో పాటు, ఈ ప్రకటన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ప్రదర్శించ బడుతుందనే విషయం తెలిసి, సితారకు మరిన్ని అవకాశాలతో పాటు, ప్రపంచానికి ఆమె ఉనికి తెలుస్తుందని భావించిన మహేష్, నమ్రత దంపతులు ఈ యాడ్ చేసేందుకు ఒప్పుకున్నారట. వారు ఊహించినట్లుగా ఇది సితారకు మంచి అవకాశమనే చెప్పాలి.
Lighting up the Times Square!!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram