టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. మ‌హేశ్ బాబు త‌ల్లి క‌న్నుమూత‌

విధాత: టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ స‌తీమ‌ణి, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరాదేవి ఇవాళ ఉద‌యం కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఇందిరా దేవి.. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె బుధ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇందిరాదేవి మృతితో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులంద‌రూ శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఇందిరా దేవి మృతిప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. మ‌హేశ్ బాబు త‌ల్లి క‌న్నుమూత‌

విధాత: టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ‌ స‌తీమ‌ణి, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరాదేవి ఇవాళ ఉద‌యం కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఇందిరా దేవి.. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె బుధ‌వారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఇందిరాదేవి మృతితో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులంద‌రూ శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఇందిరా దేవి మృతిప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబ స‌భ్యులు, అభిమానుల సంద‌ర్శ‌నార్థం ఇందిరా పార్థివదేహాన్ని ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌ద్మాల‌య స్టూడియోలో ఉంచ‌నున్నారు. అనంత‌రం జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో ఇందిరా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

కృష్ణ‌, ఇందిరల‌కు ఐదుగురు సంతానం. ఇద్ద‌రు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ర‌మేశ్ బాబు, మ‌హేశ్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియ‌ద‌ర్శిని. పెద్ద కుమారుడు ర‌మేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మృతి చెందాడు. కృష్ణ, విజ‌య నిర్మ‌ల‌కు సంతానం న‌రేశ్‌. కృష్ణ రెండో భార్య విజ‌య నిర్మ‌ల‌.. అనారోగ్యంతో 2019, జూన్ 27న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.