Mahesh | సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కిన మహేష్.. అమ్మాయి ఎవరో తెలిస్తే అందరు షాక్..!
Mahesh | బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ విట్టా ఒకరు. నాగార్జున హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. టాలీవుడ్ కమెడియన్‌గా కూడా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ విట్టా స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆయన పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కడంతో అందరు […]

Mahesh |
బిగ్ బాస్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ విట్టా ఒకరు. నాగార్జున హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. టాలీవుడ్ కమెడియన్‌గా కూడా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ విట్టా స్టార్ హీరోల సినిమాలలో కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆయన పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కడంతో అందరు అవాక్కవుతున్నారు. అయితే మహేష్ విట్టా గత కొన్ని సంవత్సరాలుగా తను ప్రేమిస్తున్న శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రొద్దుటూరులోనిహెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్లో వారిద్దరి వివాహం చాలా అట్టహాసంగా జరిగింది. వీరి పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం మహేష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడే మహేష్ తన లవ్ గురించి చెప్పుకొచ్చాడు. సుమారు ఐదేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు కాని ఆమె పేరు శ్రావణి రెడ్డి అని చెప్పలేదు. పెళ్లైన తర్వాత ఆమె పేరు, ఫొటో రివీల్ చేశాడు.. మరో ట్విస్ట్ ఏంటంటే శ్రావణి స్వయంగా తన చెల్లెలు ఫ్రెండేనట.
రెండేళ్ల స్నేహం తర్వాత తన ప్రేమను శ్రావణి అంగీకరించిందని మహేష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మహేశ్ రాయలసీమ స్లాంగ్‌లో మాట్లాడుతూ యూట్యూబ్‌లో పలు వీడియోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా రెండు సార్లు చోటు దక్కించుకున్న మహేష్ టైటిల్ గెలుచుకోలేకపోయిన అభిమానులు మనసులు గెలుచుకున్నాడు.
సెప్టెంబర్‌లో తమ వివాహం ఉంటుందని గతంలో తెలియజేసిన మహేష్ విట్టా.. చెప్పినట్టుగానే సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. మహేష్ చేసుకున్న అమ్మాయి శ్రావణి రెడ్డి విషయానికొస్తే .. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తోంది. ఆమె కూడా బాగానే సంపాదిస్తున్నట్టు సమాచారం. ఇక మహేశ్ కూడా పలు టాలీవుడ్ సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూ మరో వైపు యూట్యూబ్‌లో కూడా భారీగానే
సంపాదిస్తున్నాడు.