Malkajgiri | మైనంప‌ల్లిని మార్చే యోచ‌న‌లో BRS! ప‌రిశీల‌న‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, శంభీపూర్ రాజుల పేర్లు

Malkajgiri | విధాత‌: మ‌ల్కాజిగిరి అభ్యర్థిగా ప్ర‌క‌టించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావును మార్చే యోచ‌న‌లో బీఆరెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న కుమారుడికి కూడా మెద‌క్ టికెట్ కావాల‌ని కోర‌గా సీఎం కేసీఆర్ సున్నితంగా ప‌క్క‌న పెట్టారు. త‌న కుమారుడిని ప‌క్క‌న పెట్ట‌డానికి మంత్రి హ‌రీశ్‌రావు కార‌ణ‌మ‌ని సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. మైనంప‌ల్లి వాఖ్య‌ల‌ను కేటీఆర్ త‌ప్పు ప‌ట్టారు. సీఎం కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా మాట్లాడుతూ మైనంప‌ల్లికి టికెట్ ఇచ్చాం పోటీ చేస్తారా లేదా […]

  • By: krs    latest    Aug 22, 2023 12:53 PM IST
Malkajgiri | మైనంప‌ల్లిని మార్చే యోచ‌న‌లో BRS! ప‌రిశీల‌న‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, శంభీపూర్ రాజుల పేర్లు

Malkajgiri |

విధాత‌: మ‌ల్కాజిగిరి అభ్యర్థిగా ప్ర‌క‌టించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావును మార్చే యోచ‌న‌లో బీఆరెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌న కుమారుడికి కూడా మెద‌క్ టికెట్ కావాల‌ని కోర‌గా సీఎం కేసీఆర్ సున్నితంగా ప‌క్క‌న పెట్టారు.

త‌న కుమారుడిని ప‌క్క‌న పెట్ట‌డానికి మంత్రి హ‌రీశ్‌రావు కార‌ణ‌మ‌ని సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే. మైనంప‌ల్లి వాఖ్య‌ల‌ను కేటీఆర్ త‌ప్పు ప‌ట్టారు. సీఎం కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా మాట్లాడుతూ మైనంప‌ల్లికి టికెట్ ఇచ్చాం పోటీ చేస్తారా లేదా అనేది ఆయ‌న ఇష్ట‌మ‌న్నారు.

అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించిన త‌రువాత కూడా ఆయ‌న అసంతృప్తితో ఉన్న‌ట్లు భావిస్తున్న అధిష్ఠానం ప్ర‌త్యామ్నాయంగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్ల‌ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. మైనంప‌ల్లి పార్టీపై తిరుగుబాటు చేస్తే ఇద్ద‌రిలో ఒక‌రి అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.