MLA Beerla Ailaiah: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య!
MLA Beerla Ailaiah : కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో పని చేసే గంధమల్ల రవి శుక్రవారం రాత్రి మూడవ అంతస్తులో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న రవి పై అంతస్తులో నివాసం ఉంటున్నాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే రవి మరణం అనుమానస్పదంగా ఉందని..పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శక విచారణ జరిపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram