Mancherial | TUWJ, IJU ద్వితీయ మహాసభకు అనూహ్య స్పందన

Mancherial భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు  విధాత‌: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) మంచిర్యాల జిల్లా ద్వితీయ మహాసభకు అనూహ్య స్పందన లభించింది. మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు హాజరయ్యారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూనియన్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకోవడం విశేషం. […]

Mancherial | TUWJ, IJU ద్వితీయ మహాసభకు అనూహ్య స్పందన

Mancherial

  • భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

విధాత‌: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) మంచిర్యాల జిల్లా ద్వితీయ మహాసభకు అనూహ్య స్పందన లభించింది. మంచిర్యాల(Mancherial) జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు హాజరయ్యారు.

జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యూనియన్ పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకోవడం విశేషం. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో పథకం ప్రకారం మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న పాలకుల కుట్రలను పోరాటాలతోనే ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు.

దాదాపు 65ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు సాధించడంతో పాటు వారి హక్కుల పరిరక్షణ, భావప్రకటన స్వేచ్ఛ కోసం అహర్నిశలు పోరాటాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రధాన కే.విరాహత్ అలీ మాట్లాడుతూ… దేశంలో ఐజేయూ, రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘాలను మాత్రమే జర్నలిస్టులు ఆదరిస్తున్నారని, ఈ క్రమంలో టీయూడబ్ల్యూజే, ఐజేయు యూనియన్ జర్నలిస్టుల పక్షపాతిగా నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపైనే ఐజేయూ, టీయుడబ్ల్యుజె సంఘం నిర్మాణమైనట్లు విరాహత్ అన్నారు.

జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, ఇండ్లు, ఆరోగ్య భద్రతా, విద్య తదితర సంక్షేమ పథకాల సాధనకు పోరాడుతున్నట్లు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సతీష్, జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు మాంతయ్య, వంశీకృష్ణ, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం బాధ్యుడు సంపత్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్, ఆకుల రాజు, సురేష్ చౌదరి, డేగ సత్యం, సంతోష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నికల పరిశీలకులుగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంపత్ హాజరయ్యారు.