Manchiryala: BJPలో భగ్గుమన్న గ్రూప్ విభేదాలు

Manchiryala ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి ముందే వాగ్వాదం విధాత‌: మంచిర్యాల(Manchiryala) బెల్లంపల్లిలో బిజెపి పార్టీలో కూడా అంతర్గత విభేదాలు, లుకలుకలు బయటపడ్డాయి. ప్రోటాకాల్ విషయంలో శుక్రవారం బెల్లంపల్లిలో ఇరువర్గాల నాయకులు వాగ్వాదం చేసుకున్నారు. ఇదంతా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఎదుటే జరగడంతో కార్యకర్తలు విస్తుపోయారు. పట్టణంలోని అశోకనగర్ బాలాజీ ఫంక్షన్ హాల్లో శక్తి కేంద్రం ఇన్చార్జీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఫిషరీష్ పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పురుషోత్తం […]

  • Publish Date - April 21, 2023 / 01:51 PM IST

Manchiryala

  • ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి ముందే వాగ్వాదం

విధాత‌: మంచిర్యాల(Manchiryala) బెల్లంపల్లిలో బిజెపి పార్టీలో కూడా అంతర్గత విభేదాలు, లుకలుకలు బయటపడ్డాయి. ప్రోటాకాల్ విషయంలో శుక్రవారం బెల్లంపల్లిలో ఇరువర్గాల నాయకులు వాగ్వాదం చేసుకున్నారు. ఇదంతా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఎదుటే జరగడంతో కార్యకర్తలు విస్తుపోయారు.

పట్టణంలోని అశోకనగర్ బాలాజీ ఫంక్షన్ హాల్లో శక్తి కేంద్రం ఇన్చార్జీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ఫిషరీష్ పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జి గంగారెడ్డి, పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ లు హాజరయ్యారు.

సమావేశానికి ముందు స్టేజీ పైకి నియోజకవర్గ నాయకులు కొయ్యల ఏమాజీని పిలిచారు. దీంతో పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ అభ్యంతరం తెలిపాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడడమే కాకుండా, ఏ పదవి లేని ఏమాజీని స్టేజీ పైన ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. ప్రోటాకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ఇరువర్గాల నాయకుల నడుమ కొద్ది సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ కలగజేసుకుని రమేష్ ను శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. చివరకు రమేష్ వర్గం నాయకులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.