Manchu Manoj | రెండో పెళ్లికి మంచు మనోజ్ రెడీ.. ఆమెతోనే ఏడడుగులు
Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు( Mohan Babu ) రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైపోయాడు. మరికొద్ది గంటల్లోనే మనోజ్.. భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika )ని మనువాడబోతున్నాడు. మనోజ్, మౌనిక కుటుంబాలకు చెందిన సభ్యులు, బంధువుల సమక్షంలోనే ఈ వివాహం జరగబోతోంది. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మంచు లక్ష్మీ( Manchu Laxmi ) ఇంట్లో ఈ పెళ్లి జరగనుంది. భూమా మౌనికను మనోజ్ […]

Manchu Manoj | టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు( Mohan Babu ) రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైపోయాడు. మరికొద్ది గంటల్లోనే మనోజ్.. భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika )ని మనువాడబోతున్నాడు. మనోజ్, మౌనిక కుటుంబాలకు చెందిన సభ్యులు, బంధువుల సమక్షంలోనే ఈ వివాహం జరగబోతోంది. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు మంచు లక్ష్మీ( Manchu Laxmi ) ఇంట్లో ఈ పెళ్లి జరగనుంది.
భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకుంటారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. అలా అందరూ అనుకున్నట్టే మౌనిక రెడ్డి ఫోటోను మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ ఫోటోకు మనోజ్ మంచు పెళ్లి కూతురు భూమా మౌనిక(లవ్ సింబల్). మనోజ్ వెడ్స్ మౌనిక అని ఫోటోకు ఆ హీరో క్యాప్షన్ ఇచ్చాడు. మౌనిక, మనోజ్‌కు వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2015లో ప్రణతి రెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్
మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న మనోజ్.. నాలుగేండ్ల తర్వాత భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకుంటున్నాడు.
మౌనికకు కూడా ఇది రెండో పెళ్లే..
భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. చిత్తూరు జిల్లాకు చెందిన బిజినెస్‌మెన్ గణేశ్ రెడ్డితో మౌనికకు 2016లో పెళ్లైంది. 2018లో ఈ జంటకు సంతానం కూడా కలిగింది. 2020లో గణేశ్, మౌనిక విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి ఒంటరిగా ఉంటున్న మౌనికకు మనోజ్‌తో ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా దారి తీసింది.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika