Manchu Vishnu | మంచు విష్ణు కలల చిత్రం.. రూ.150 కోట్ల బడ్జెట్‌తో మొదలైన పాన్ ఇండియా చిత్రం ‘భక్త కన్నప్ప’
Manchu Vishnu | కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇండస్ట్రీలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నాడు. ఆయన ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కలల చిత్రం భక్త కన్నప్పని రూపొందించాలని ప్రణాళికలు రచించుకుంటుండగా, ఎట్టకేలకి ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్నిభారీ […]

Manchu Vishnu |
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇండస్ట్రీలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నాడు. ఆయన ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన కలల చిత్రం భక్త కన్నప్పని రూపొందించాలని ప్రణాళికలు రచించుకుంటుండగా, ఎట్టకేలకి ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది.
‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు మంచు సరసన కథానాయికగా నటించనుంది.
‘‘స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దగా, చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.
చిత్రంలో భక్త కన్నప్ప అతని గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. త్వరలో షూటింగ్ మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నాం. భారతీయ సినిమా పరిశ్రమలోని గొప్ప నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు అని విష్ణు చెప్పుకొచ్చారు.
గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీకి మంచి విజయం ఒక్కటి కూడా లేదు. మార్కెట్ చాలా తగ్గింది. మరి అలాంటిది ఈ సమయంలో మంచు విష్ణు ఏకంగా 150 కోట్లతో సినిమా అంటే ఇండస్ట్రీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పిన విష్ణు.. తర్వాత ఎవరైనా కలిస్తే ప్రకటిస్తానని అన్నారు. ఇందులో మీకు తెలియని చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని విష్ణు స్పష్టం చేశారు.
… @iVishnuManchu unveils his dream project #Kannappa
Produced by the iconic @themohanbabu garu, directed by #MukeshKumarSingh, this movie promises to be a cinematic marvel in the making.#VishnuManchu #NupurSanon #KannappaATrueEpicTale @avaentertainment @24FramesFactory pic.twitter.com/fPLpviv05W
— BA Raju’s Team (@baraju_SuperHit) August 18, 2023