Manchu Vishnu | మా ప్రెసిడెంట్‌ గారు అప్పుడు అంత రచ్చ చేసి.. ఇప్పుడిలా అంటాడేంటి?

Manchu Vishnu విధాత‌: సినిమావాళ్లు ఏది చేసినా ఈమధ్య పెద్ద న్యూసే అవుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విషయమైనా సరే అది చిరిగి చేటంతై, చాపంత అవుతుంది. నిజానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇంత రచ్చ ఉండేది కాదు.. ఏదైనా కలిసికట్టుగా సాగిపోయేది. ఏదైనా మంచి పని చేద్దాం అంటే చేద్దాం అని నలుగురూ నాలుగు చేతులూ కలిపి ముందుకు వచ్చే వారు. మరిప్పుడో అలా లేదు పరిస్థితి. ఏదైనా చేద్దాం అనుకోకుండానే నాలుగు వివాదాలు […]

  • Publish Date - August 3, 2023 / 12:48 PM IST

Manchu Vishnu

విధాత‌: సినిమావాళ్లు ఏది చేసినా ఈమధ్య పెద్ద న్యూసే అవుతుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విషయమైనా సరే అది చిరిగి చేటంతై, చాపంత అవుతుంది. నిజానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో ఇంత రచ్చ ఉండేది కాదు.. ఏదైనా కలిసికట్టుగా సాగిపోయేది.

ఏదైనా మంచి పని చేద్దాం అంటే చేద్దాం అని నలుగురూ నాలుగు చేతులూ కలిపి ముందుకు వచ్చే వారు. మరిప్పుడో అలా లేదు పరిస్థితి. ఏదైనా చేద్దాం అనుకోకుండానే నాలుగు వివాదాలు వచ్చి పడుతున్నాయి. నలుగురూ నాలుగు దిక్కుల్లోకి పోతున్నారు. దీనికి ఉదాహరణగా ‘మా’ అసోషియేషన్‌ని తీసుకోవచ్చు.

గతంలో కంటే కాస్త మసాలా దట్టించి రచ్చ రచ్చ చేసి మరీ ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయాన్ని అందుకున్నాడు. అంతేనా అదేదో ప్రధాని ఎన్నికన్నంత హైప్ పెంచేశారు చుట్టూ చేరిన జనాలు. ఈ ఎన్నిక కోసం జయప్రద లాంటి సీనియర్ నటీమణిని కూడా రిక్వెస్ట్ చేసి మరీ తీసుకువచ్చాడు మంచు విష్ణు తండ్రి.. మంచు మోహన్ బాబు.

ఇలా వీళ్ళ మీద అభిమానంతో కొందరు, అధికారం కోసం కొందరు, మొహమాటం కోసం కొందరు అంతా కలిపి విష్ణుబాబును గద్దెనెక్కించారు. అయితే ఇక విష్ణుబాబు కూడా దానికి తగినట్టే ఇప్పటి వరకూ వ్యవహరిస్తూ వస్తున్నాడు. తనకు తోచిందే ధర్మం.. తను చెప్పిందే వేదం అన్నట్టు సాగింది ఇన్నాళ్ళు.. సడెన్ గా ఏమైందో ఏమో..

తాజాగా మా సర్వ సభ్య సమావేశంలో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తను వచ్చే మా ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నానని అసోసియేషన్‌కు తెలియజేశాడట విష్ణు. ఈ ఎన్నికలు ఈ సంవత్సరం సెప్టెంబరులో జరగాల్సి ఉండగా వచ్చే ఏడాది మేకి వాయిదా వేస్తున్నట్టుగా మా అసోసియేషన్ తీర్మానించింది. దీనికి అసోసియేషన్ ఆడిట్ సమస్యలే కారణమని, వచ్చే ఎన్నికల్లోపు తను సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, మంచి విష్ణు ఆపైన ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్టు గా సమాచారం అందుతోంది.

సో.. అంత రాద్ధాంతం చేసి.. ఏదో మమ అనిపించి దిగుపోతున్నాడు తప్పితే.. ఆయన పర్ఫెక్ట్ చేసిందీ లేదు.. హామీలు నెరవేర్చిందీ లేదు. ముఖ్యంగా ‘మా’ భవనం అంత ఈజీ అనుకుని.. ఏదేదో ఊహించుకు న్నాడో. తీరా ఎగ్గాక తెలిసింది విషయం. అందుకే ఇక టాటా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడనేలా.. మంచు విష్ణు నిర్ణయంపై ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు మాట్లాడుకుంటుండటం గమనార్హం.

Latest News