Kannappa: కన్నప్పలో మంచు విష్ణు కూతుళ్ల నట విన్యాసం !

Kannappa: కన్నప్పలో మంచు విష్ణు కూతుళ్ల నట విన్యాసం !

Kannappa:  హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నిర్మించిన కన్నప్ప సినిమాలో..జనులారా..వినరారా శ్రీకాళహస్తి గాథ.. లిరికల్ సాంగ్ వీడియోను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఈ భక్తి పాటలో మంచు విష్ణు కూతుళ్లు అరియానా, విరియానాలు ఈ పాటను పాడటంతో పాటు తన డ్యాన్స్, ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. భారీ లోకేషన్ల మధ్య చిత్రీకరించిన పాట సంగీత, సాహిత్యపరంగా ఆకర్షించేదిగా ఉంది. పాటలో శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ మెరిశారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించగా, సుద్దాల అశోక్ తేజా పాట రాశారు. టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.

రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్‌ ను విడుదల చేశారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.