Komatireddy | KCR పాలనకు కాలం చెల్లింది.. అందుకే BRS నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

Komatireddy Venkat Reddy  విధాత: మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ పాలనకు రోజులు చెల్లాయని, అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం యాదగిరి గుట్ట కాంగ్రెస్ నాయకురాలు గుండ్ల వాణీ భరత్, అరుణ గుణశేఖర్, ముక్కెర్ల మల్లేష్, సరోజన హరీష్‌లు వారి అనుచరులతో కలిసి […]

Komatireddy | KCR పాలనకు కాలం చెల్లింది.. అందుకే BRS నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

Komatireddy Venkat Reddy

విధాత: మాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్ పాలనకు రోజులు చెల్లాయని, అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం యాదగిరి గుట్ట కాంగ్రెస్ నాయకురాలు గుండ్ల వాణీ భరత్, అరుణ గుణశేఖర్, ముక్కెర్ల మల్లేష్, సరోజన హరీష్‌లు వారి అనుచరులతో కలిసి వెంకట్‌రెడ్డి సమక్షంలో తిరిగి హస్తం గూటికి చేరారు.

ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. 5లక్షల కోట్ల అప్పు చేసిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. ఉద్యోగస్తులు కేసీఆర్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏదో ఒక పథకంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందన్నారు. బీసీలకు లక్ష రూపాయలు అని, దళిత బంధు అంతా కమీషన్లతో సాగుతోందన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే పని అవుతోందన్నారు.

కాంగ్రెస్ పాలనలో 1వ తారీఖున జీతాలిచ్చామని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందన్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను లాగేసుకుని గెలవాలని చూస్తున్నారన్నారు. ఖమ్మం జనగర్జన సభను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. ప్రజలందరూ ఈసారి మా వైపు ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను గెలిపించాలని చూస్తున్నారని, కార్యకర్తలు కూడా కష్టపడి పని చేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.

యాదగిరిగుట్టలో 12కి 12 ఎంపీటీసీలు గెలిపించి వాణీ భరత్‌ను చైర్ పర్సన్ చేస్తామన్నారు. ఆలేరులోనే కాదని, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందన్నారు. గత రెండు పర్యాయాలు కేసీఆర్ మాయ మాటలు విని మోసపోయామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. కర్ణాటకలో విజయఢంకా మోగించామని, వంద మీటింగులు పెట్టిన మోడీ, అమిత్ షాను అక్కడి ప్రజలు నమ్మలేదన్నారు. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ అంటే డైరెక్ట్ గా సీఎం దగ్గరకే పోవచ్చని, రాజశేఖర్ రెడ్డి హయాంలో సర్పంచ్‌లు సీఎంను కలిసి నిధులు తెచ్చుకునేవారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరకు ఎమ్మెల్యేనే వెళ్లే పరిస్థితి లేదని, కాంగ్రెస్ ది ప్రజాస్వామ్య పాలన అన్నారు. వేల కోట్లు సంపాదించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరికైనా సాయం చేయడం లేదని, నావద్దకు వచ్చే అందరికి సాయం చేస్తున్నానన్నారు.

బీఆర్ఎస్‌లో ఎంతోమంది లీడర్లు నరకయాతన అనుభవిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ అసహనంతో ఉన్నారని, వారంతా చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. జీతాలు రాని ఉద్యోగులు, నోటిఫికేషన్ల పేరుతో మోసపోయిన నిరుద్యోగులు, రైతు బంధు, పరిహారం, రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతులు, ఇంకా ఇతర వర్గాలు అందరూ ఈసారి కాంగ్రెస్‌ను గెలిపిస్తారన‌న్నారు.

పార్టీలో చేరిన వాణి భరత్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాటలు విని గతంలో బీఆర్ఎస్‌లో చేరామన్నారు. చైర్మన్ పదవి ఆశ చూపి తమకు గులాబీ కండువా కప్పారన్నారు. కానీ చేరినప్పటి నుంచి అవమానాలేనని, భరించలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒకానొక టైమ్ లో సూసైడ్ చేసుకుందామనుకున్నానని, అంతగా బాధపెట్టారన్నారు.

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మా ఆయన మీద దొంగ కేసులు పెట్టారని, ఎంతో వేధించారన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని ఆశచూపారని, బీఆర్ఎస్‌లో చేరినా మనిషి కంటే హీనంగా చూశారన్నారు. చచ్చేవరకు కాంగ్రెస్ లోనే ఉంటానని, పదవి ఉన్నా లేకున్నా.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు.