నేనూ.. లోకేష్ టార్గెట్! చంపుతారేమో: చంద్రబాబు కామెంట్స్

విధాత: ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి అవకాశం వచ్చినపుడు వాళ్ళు అవతలివారిమీద చెలరేగిపోతున్నారు. వెనకముందూ చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అనే నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ పాలన మీద విరుచుకు పడ్డారు. బాబాయ్ వివేకానందరెడ్డిని చంపినట్లుగానే తనను, లోకేష్‌ను కూడా వైసీపీ నేతలు హత్య చేస్తారేమో అంటూ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. గొడ్డలి […]

  • By: krs    latest    Nov 30, 2022 1:53 PM IST
నేనూ.. లోకేష్ టార్గెట్! చంపుతారేమో: చంద్రబాబు కామెంట్స్

విధాత: ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి అవకాశం వచ్చినపుడు వాళ్ళు అవతలివారిమీద చెలరేగిపోతున్నారు. వెనకముందూ చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కూడా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగిలో రాష్ట్రానికి ఇదేమి ఖర్మ అనే నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ పాలన మీద విరుచుకు పడ్డారు.

బాబాయ్ వివేకానందరెడ్డిని చంపినట్లుగానే తనను, లోకేష్‌ను కూడా వైసీపీ నేతలు హత్య చేస్తారేమో అంటూ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు అసలు ఆ కేసు దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఎందుకు బదలాయించారో తెలుసా ? దీనికి సమాధానం ఉందా అని ప్రశ్నించారు.

ఆనాడు జగన్ కోడికత్తి దాడి అంటూ జనాన్ని నమ్మించారని, రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు. నేడు ఏపీలో పోలీసుల మెడ మీద కత్తి పెట్టి జగన్ పనిచేయిస్తున్నారని అన్నారు. జగన్‌కి పోలీసుల బలం ఉంటే తనకు ప్రజా బలం ఉందని బాబు అంటున్నారు.

ఏపీలో ఉన్మాదుల పాలన సాగుతోందని మరోసారి వారికే అధికారం అప్పచెబితే మాత్రం ఏపీకి కష్టమే అని తేల్చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కి అన్ని అనుమతులు తాను కేంద్రం నుంచి సాధించుకుని వచ్చానని 72 శాతం పైగా పూర్తి చేశానని అయినా దాన్ని మూడేళ్ళుగా ఏమీ కట్టలేక పోయారని ఆరోపించారు.

రివర్స్ టెండరింగ్ అంటూ ఆ ప్రాజెక్టును అక్కడే వదిలేశారని ఆరోపించారు. టీడీపీ రాజకీయ కన్సల్టెంట్ రాబిన్ శర్మ సూచన మేరకు ఈ ఇదేమి ఖర్మ నిరసన ప్రోగ్రాం డిజైన్ చేసారని అంటున్నారు. గతంలో బాదుడే బాదుడు కూడా రాబిన్ శర్మ సలహమేరకేనని అంటున్నారు.