Medak | పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 40 ఏళ్ల తరువాత కలిసిన మిత్రబృందం

Medak | విధాత, మెదక్ బ్యూరో: వారంతా ఆనాటి స్నేహితులు.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దశబ్దాలు.. అంటే 40 సంవత్సరాల క్రితం ఓకే పాఠశాలలో, ఓకే తరగతిలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిర పడ్డారు. వారంతా ఓకే వేదికగా ఒక్కటయ్యారు. దీంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అదేనండి.. నాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళం. మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పదో తరగతి(1982-83) పూర్వ […]

  • By: krs    latest    Aug 07, 2023 12:06 AM IST
Medak | పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 40 ఏళ్ల తరువాత కలిసిన మిత్రబృందం

Medak |

విధాత, మెదక్ బ్యూరో: వారంతా ఆనాటి స్నేహితులు.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దశబ్దాలు.. అంటే 40 సంవత్సరాల క్రితం ఓకే పాఠశాలలో, ఓకే తరగతిలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిర పడ్డారు. వారంతా ఓకే వేదికగా ఒక్కటయ్యారు. దీంతో వారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అదేనండి.. నాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళం.

మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పదో తరగతి(1982-83) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్నేహితుల దిననోత్సవం పురస్కరించుకోని ఆదివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా 40 సంవత్సరాల నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు.

విద్యార్థి దశలో చేసిన చిలిపి చేష్టాలు, కలిసి మెలిసి ఆడిపాడిన గతాన్ని గుర్తు చేసుకున్నారు. కష్టసుఖాల ను ఒకరికోకరు పంచుకున్నారు. త్వరలో కుటుంబ సభ్యులతో సమ్మేళనం నిర్వహించుకోని చదువు నేర్పిన గురువులను సన్మానించుకోవాలని తీర్మానించుకున్నారు.

సమావేశంలో తొడుపునూరి సతీష్, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, సిద్దిరాములు, కామటి కృష్ణ, వెంకటేశం, రాంచంద్రరెడ్డి, వినోద్, బూర్ల శ్రీనివాస్, కృష్ణాగౌడ్, విష్ణువర్దన్ రెడ్డి, రాంమోహన్, మహేశ్, కాశీనాథ్, రవీందర్, శ్రీదర్ రెడ్డి, వీర్ కుమార్, బాస్కర్, రాజశేఖర్, బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.