విధాత,మెదక్ బ్యూరో: హనుమత్ విజయోత్సవం (చిన్న జయంతి) సందర్భంగా గురువారం మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీపంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
ఆలయ వంశానుగత ధర్మకర్త కాకులవరం మధుసూదనాచారి ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి 116 లీటర్ల ఆవుపాలతో క్షీరాభిషేకం, మహా అలంకరణ, మహా మంగళహారతి. అనంతరం తీర్థప్రసాదం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ స్వాములచే 108 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
స్వామిని దర్శించుకున్న వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, డైరెక్టర్ రాగి చక్రపాణి, పాపన్నపేట ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, పాపన్నపేట మండలం పరిషత్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్, భీమరి కిషోర్,
నాయకులు లింగారెడ్డి, ఆశోక్, సాయిరాం, తొడుపునూరి శివరామకృష్ణ, కొండ శ్రీనివాస్, యాచం రాజు, కొత్త చంద్రమోహన్, ఆది సురేందర్ తో పాటు మెదక్ తదితర్ ప్రాంతాల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.