Medak | తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే.. సత్వరమే నష్టపరిహారం చెల్లించాలి: అన్వేష్‌రెడ్డి
Medak సకాలంలో నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి పాపన్న పేట మండలంలో క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలించిన.. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, పొడిచన్ పల్లి, పొడిచన్ పల్లి తండాల్లో అకాల […]

Medak
- సకాలంలో నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి
- పాపన్న పేట మండలంలో క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలించిన..
- కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, పొడిచన్ పల్లి, పొడిచన్ పల్లి తండాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పార్టీ డిసిసి అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పెట్టుబడి ఆధారంగా నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు 10000 చొప్పున నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత నాలుగు ఐదేళ్లుగా రైతులు అకాల వర్షాలతో నష్టపోతే నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల కూడా రైతులు నష్టపోయారన్నారు. ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముందే ప్రారంభించి ఉంటే రైతులు కొంతమేరకు నష్టం నుంచి తప్పించుకునే వారన్నారు.
మెదక్ జిల్లాలో సుమారు 15వేల ఎకరాల పై చిలుకు వరి ధాన్యం వేశారని అందులో 50% అకాల వర్షాలకు దెబ్బతిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించి వారిని ఆదుకొని వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం కిసాన్ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని మరియు మొలకెత్తిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి లోపాల వలన పాస్ బుక్కులలో ఎంట్రీ కాని రైతుల పంట పొలాలను రెవెన్యూ అధికారుల చేత సర్టిఫై చేయించి బాధితుల ఖాతాల్లోనే నష్టపరిహారం పడేలా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ అధికారులను సమన్వయం చేయాలని కోరారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు.
కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, ఎంపీటీసీ లు శ్రీనివాస్, రమేష్ గౌడ్, సతీష్,శ్రీకాంత్ రెడ్డి, విటలక్షప్ప, ప్రేమ్ కుమార్, లక్ష్మి నారాయణ, బాగారెడ్డి,నసిర్, దుర్గేష్, నర్సుములు, మహేందర్ రెడ్డి, దుర్గేష్, మధుసూదన్ రెడ్డి,జనార్దన్, రాజు ఇతరులు పాల్గొన్నారు.