Medaram Maha Jatara| మేడారం మహా జాతర తేదీలు ఖరారు
విధాత : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. 28న సాయంత్రం 6గంటలకు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు గద్దెలకు చేరుకుంటారు. 29న సాయంత్రం 6గంటలకు సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, 31న సాయంత్రం 6 గంటల సమయంలో తిరిగి సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram