Meerut | హైరేంజ్‌లో పెంపుడు కుక్క బర్త్‌డే.. ఏ రేంజ్‌లో చేశారో ఈ వీడియో చూడండి
Meerut మీరట్‌లో 11 కేజీల కేక్ కటింగ్ 300 మంది అతిథులకు ఆహ్వానం వీఐపీల వివాహం తరహాలో మెనూ వీధి కుక్కలకు, కోతులకు, గోవులకు బ్రేక్ ఫాస్ట్ పార్టీ ఇచ్చిన యజమాని లక్కీ డ్రా విజేతకు ఫ్రిడ్జ్ బహూకరణ విధాత: ఇటీవల కొందరు తమ పెంపుడు కుక్కలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లినా కూడా తమ వెంటే విమానాల్లో తీసుకెళ్తున్నారు. వాటిని వదిలి నిమిషంగా కూడా ఉండటం లేదు.వాటి పుట్టిన రోజులను సైతం గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని […]

Meerut
- మీరట్‌లో 11 కేజీల కేక్ కటింగ్
- 300 మంది అతిథులకు ఆహ్వానం
- వీఐపీల వివాహం తరహాలో మెనూ
- వీధి కుక్కలకు, కోతులకు, గోవులకు
- బ్రేక్ ఫాస్ట్ పార్టీ ఇచ్చిన యజమాని
- లక్కీ డ్రా విజేతకు ఫ్రిడ్జ్ బహూకరణ
విధాత: ఇటీవల కొందరు తమ పెంపుడు కుక్కలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లినా కూడా తమ వెంటే విమానాల్లో తీసుకెళ్తున్నారు. వాటిని వదిలి నిమిషంగా కూడా ఉండటం లేదు.వాటి పుట్టిన రోజులను సైతం గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్(Meerut)కు చెందిన ఒక ప్రొఫెసర్ తన పెంపుడు కుక్క అలెక్స్ పుట్టిన రోజును చాలా గ్రాండ్ నిర్వహించాడు. ఈ నెల మూడో తేదీన అలెక్స్ బర్త్‌ను వీఐపీ పెండ్లి తరహాలో వైభవోపేతంగా నిర్వహించాడు. గ్రాండ్‌గా బెలూన్లతో స్టేజ్ ఏర్పాటు చేసి కుచ్చు టోపీ పెట్టాడు.
11 కిలోల కేక్ కట్ చేసి దానిని తినిపించాడు. 300 మంది అతిథులను ఆహ్వానించాడు. అతిథులంతా అలెక్స్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలెక్స్ బర్త్ పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అలెక్స్ బర్త్ పార్టీ విశేషాలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే!
11 కిలోల ఖరీదైన కేక్‌ను యజమాని కట్ చేయించాడు. వీఐపీల వివాహంలో వడ్డించే ఆహార పదార్థాలతో మెనూ సిద్ధం చేశాడు. టిక్కీ, చౌమీన్, చోలే-భాతురే, చాట్, వివిధ రకాల స్వీట్లు, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్ లు సహా అన్ని రకాల ఆహార పదార్థాలను వడ్డించాడు.
వీధి కుక్కలకు, కోతులకు, గోవులకు ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ పార్టీ ఇచ్చాడు. వాటికి బ్రెడ్, జాగ్రే, అరటిపండ్లు తినిపించాడు. అలెక్స్ పుట్టిన రోజు సందర్భంగా అదనంగా లక్కీ డ్రా కూడా నిర్వహించాడు. లక్కీ డ్రాలో గెలిచిన విజేతకు ఫ్రిడ్జ్ బహూకరించాడు.
అలాగే పార్టీకి హాజరైన అతిథులు కూడా అలెక్స్‌కు అనేక కానుకలు తీసుకొచ్చారు. బర్త్ డే పార్టీకి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలను సైతం పెట్ డాగ్ యజమాని ప్రింట్ చేయించాడు. మరికొందరికి వాట్సాప్ ద్వారా వీడియో కార్డ్స్ పంపించాడు.
అలెక్స్ బర్త్ పార్టీకి మొత్తం 300 మందిని అలెక్స్ యాజమాని ఆహ్వానించాడు. వచ్చిన అతిథులకు కానుకలు కూడా పంచాడు.పెంపుడు కుక్క బర్త్ డేను ఇంత గ్రాండ్ గా నిర్వహించిన ఆ ప్రొఫెసర్ ఆదాయం ఏ రేంజ్‌లో ఉంటోందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.