Lavanya Tripathi | మెగా ఫ్యామిలీ ఫ్లాపులు.. కోడలుకి శాపాలు? పాపం లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi విధాత‌: ‘ఒకరు నచ్చారనడానికి ఒక కారణం చాలు.. నచ్చకపోవడానికి వెయ్యి కారణాలు సిద్ధం చేసుకుంటాం’ అంటూ వినిపించే సినిమా డైలాగ్.. ఇప్పుడు మెగా కోడలు కాబోతోన్న లావణ్య త్రిపాఠి విషయంలో బాగా వైరల్ అవుతోంది. అది సినిమా, ఇది జీవితం. అభిమానుల దృష్టిలో హీరో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ ఒకలానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దీనికోసం హీరోపై ప్రేమను, అభిమానాన్ని.. యాంటీస్‌పై అసహనాన్ని అన్నింటినీ కాస్త ఎక్కువ గానే చూపిస్తూ ఉంటారు అభిమానులు. ప్రస్తుతం […]

Lavanya Tripathi | మెగా ఫ్యామిలీ ఫ్లాపులు.. కోడలుకి శాపాలు? పాపం లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi

విధాత‌: ‘ఒకరు నచ్చారనడానికి ఒక కారణం చాలు.. నచ్చకపోవడానికి వెయ్యి కారణాలు సిద్ధం చేసుకుంటాం’ అంటూ వినిపించే సినిమా డైలాగ్.. ఇప్పుడు మెగా కోడలు కాబోతోన్న లావణ్య త్రిపాఠి విషయంలో బాగా వైరల్ అవుతోంది. అది సినిమా, ఇది జీవితం.

అభిమానుల దృష్టిలో హీరో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ ఒకలానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దీనికోసం హీరోపై ప్రేమను, అభిమానాన్ని.. యాంటీస్‌పై అసహనాన్ని అన్నింటినీ కాస్త ఎక్కువ గానే చూపిస్తూ ఉంటారు అభిమానులు. ప్రస్తుతం ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మెగా కాంపౌండ్‌లో జరుగుతుంది. విషయంలోకి వెళితే..

త్వరలో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. అయితే ఈ పెళ్లిపై కొందరు మెగాభిమానులు గుర్రుగా ఉన్నారనేది సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది.

లావణ్యతో వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ పెద్దగా కలిసి రాలేదని, ముందు ముందు అస్సలు బాగోదని చిలవలు పలవలు చేసి మరీ చెప్పుకుంటున్నారు. లావణ్యతో వరుణ్ పెళ్లి కూడా కలిసిరాదని ఇందుకు మూడు కారణాలను కూడా ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు.

మొదటిది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సినీ హీరోయిన్ రేణు దేశాయ్‌తో వివాహం మూడునాళ్ళ ముచ్చటగా మిగిలిపోయిందని, హీరోయిన్స్‌తో పెళ్ళి మెగా ఫ్యామిలీకి అచ్చిరావడం లేదని.. వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుందనేలా జాతకం చెప్పేస్తున్నారు.

రెండో కారణం.. వరుణ్ నటించిన ‘గాంఢీవధారి అర్జున’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి కూడా కారణం లావణ్య త్రిపాఠినే అని.. కథ, డైరెక్షన్ కంటే కూడా లావణ్య పాదం వల్లే కలిసి రాలేదని లింక్ పెడుతున్నారు.

ఇక ముచ్చటగా మూడో కారణం కూడా సిద్ధం చేసుకున్నారు. లావణ్య ఎంట్రీతో మెగా ఫ్యామిలీలో అడుగు పెట్టగానే వరుణ్ ‘గాంఢీవధారి అర్జున’, చిరంజీవి ‘భోళాశంకర్’, పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ‘బ్రో’ సినిమాలు బోర్లా పడ్డాయని.. అందుకు కారణం లావణ్య త్రిపాఠి లెగ్ మహిమే అని ఆమెపై నెట్టేస్తున్నారు. మెగా కుటుంబంలో లావణ్య పాదం సెట్ కాదని, ఆమె అడుగుతో అన్నీ అరిష్టాలేనంటూ ఆడి పోసుకుంటున్నారట.

ఎంగేజ్‌మెంట్‌కే ఇలాంటి ఫలితాలు చూస్తే, ఇక పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుందో అంటూ తెగ ఫీలవుతున్నారు మెగా ఫ్యాన్స్. అయితే తప్పు మనవైపు పెట్టుకుని.. ఆమెను అంటే ఏ లాభం.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసి, చేసుకోవాలికానీ.. ఇలా ఏది పడితే అది చేసి.. చివరికి ఇలాంటి అమాయకులపై వేయడం మెగా ఫ్యాన్స్‌కి మొదటి నుంచి ఉన్న అలవాటే అనేలా మరికొందరు కౌంటర్స్ వేస్తున్నారు.