రైతు బిడ్డపై అర్జున్, ప్రియాంక ఆగ్ర‌హం.. త‌న బాధ‌ని బిగ్ బాస్‌కి చెప్పుకున్న ప్ర‌శాంత్

రైతు బిడ్డపై అర్జున్, ప్రియాంక ఆగ్ర‌హం.. త‌న బాధ‌ని బిగ్ బాస్‌కి చెప్పుకున్న ప్ర‌శాంత్

బిగ్‏బాస్ సీజన్ 7 మరి కొద్ది రోజుల‌లో ముగియ‌నుంది. ఈ సారి లేడి విన్న‌ర్ అవుతారో లేదంటే ఎప్ప‌టి మాదిరిగానే అబ్బాయిలే ట్రోఫీ దక్కించుకుంటారా అనేది సస్పెన్స్‌గా మారింది. గేమ్ చివరి రోజుల‌కి రావ‌డంతో స్నేహాన్ని సైతం ప‌క్క‌న పెట్టి గొడ‌వ‌లు ప‌డుతున్నారు. చిన్న చిన్న విషయాలకు అరుస్తూ.. ఏడుస్తూ గోల గోల చేస్తున్నారు. ఇన్నాళ్లు శాంతంగా కనిపించిన అర్జున్ ఇప్పుడు త‌న‌లోని కోపాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నాడు. నామినేష‌న్ స‌మ‌యంలో యావ‌ర్‌పై గ‌ట్టిగ‌ట్టిగా అరిచిన అర్జున్ తాజాగా ప్ర‌శాంత్‌పై కూడా ఫుల్ సీరియ‌స్‌గా మాట్లాడాడు. ఇక అనవసరంగా వారి మధ్యలోకి వెళ్లిమరీ ప్రశాంత్ ను తిట్టింది ప్రియాంక‌.

ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి సాండ్ ఐస్, రన్నింగ్ వంటి పోటీలను నిర్వహించారు. ముందుగా ఇసుకతో తయారు చేసిన కేకులపై చెర్రీలు పెట్టాడు బిగ్‏బాస్. ఒక పేక ముక్కలాంటి కార్డుతో చెర్రీ పడిపోకుండా కేకును కట్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇందులో ఎవరి చెర్రీ పడిపోతే వాళ్లు ఓడిపోయినట్లే. ఇక రెండో టాస్కులో గార్డెన్ ఏరియాలో ఓ గంట పెట్టి.. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్లి గంట కొడతారో వాళ్లే రెండో కంటెండర్ అవుతారని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్‌ల‌లో అర్జున్ కావాలనే పరిగెత్తకుండా ఆపేశాడని ప్రశాంత్ ఆరోపించ‌గా, అర్జున్ మాట్లాడుతూ… అదేం లేదు నా రన్నింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. నేను నిన్ను కావాలని ఆపిందేమీ లేదంటూ చెప్పుకొచ్చాడు.

అయితే అర్జున్ మాట‌ల‌కి ప్రియాంక మ‌ద్ద‌తు తెలిజేస్తూ ప్ర‌శాంత్‌ని వారిద్ద‌రు త‌ప్పుబ‌ట్టారు. యావ‌ర్ కూడా అర్జున్‌దే త‌ప్పు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే త‌నని అడ్డుకునే ప్ర‌య‌త్నం అర్జున్ చేయ‌డంతో నేను కూడా అర్జున్‌ని ప‌ట్టుకున్నాన‌ని ప్ర‌శాంత్ చెప్పగా, చివ‌రికి గేమ్ విజేత‌గా అర్జున్‌ని ప్ర‌క‌టించారు అమ‌ర్. అర్జున్‌ని బిగ్ బాస్ కంన్ఫెషన్ రూమ్ కు పిలిపించి ఉల్లిగడ్డలు తీనాలనే చిన్న టాస్క్ ఇచ్చి ఓటు అపీల్‌ కు సెకండ్ కంటెండర్ గా ప్రమోట్ చేశారు.