Venkatesh | వెంకటేష్ నట వారసుడిగా అర్జున్ ఎంట్రీపై ఉత్కంఠ.. దాగుడుమూతల మధ్య ఆసక్తికర చర్చలు

Venkatesh | దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్. కుటుంబ కథల నుంచి యాక్షన్, కామెడీ, మల్టీస్టారర్ సినిమాల వరకూ అన్ని జానర్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాత కుటుంబం నుంచి వచ్చినా, నటుడిగా స్వంత ముద్ర వేసుకున్న వెంకటేష్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

  • By: sn |    movies |    Published on : Dec 20, 2025 8:20 AM IST
Venkatesh | వెంకటేష్ నట వారసుడిగా అర్జున్ ఎంట్రీపై ఉత్కంఠ.. దాగుడుమూతల మధ్య ఆసక్తికర చర్చలు

Venkatesh | దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్. కుటుంబ కథల నుంచి యాక్షన్, కామెడీ, మల్టీస్టారర్ సినిమాల వరకూ అన్ని జానర్లలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాత కుటుంబం నుంచి వచ్చినా, నటుడిగా స్వంత ముద్ర వేసుకున్న వెంకటేష్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదే కుటుంబం నుంచి తర్వాత తరం నటులుగా రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రానా నటుడిగా కంటే నిర్మాతగా ఎక్కువగా బిజీగా ఉండగా, సరైన పాన్ ఇండియా కథల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక ‘అహింస’ సినిమాతో లాంచ్ అయిన అభిరామ్ కూడా కొత్త కథల కోసం సెర్చ్‌లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో, దగ్గుబాటి కుటుంబం నుంచి మరో వారసుడి పేరు వినిపిస్తోంది. అతడే వెంకటేష్ ఏకైక కుమారుడు అర్జున్. వెంకటేష్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అర్జున్ కూడా సినీ రంగ ప్రవేశం చేయనున్నాడన్న ప్రచారం ఇటీవల ఎక్కువైంది. ప్రస్తుతం అర్జున్ అమెరికాలో చదువుకుంటున్నాడు. వయసు కూడా హీరో ఎంట్రీకి సరిపోయే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అతడి వయసు 21 ఏళ్లు కాగా, మరో రెండు మూడు సంవత్సరాల్లో చదువు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అర్జున్ ఎంట్రీ ఉంటుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.అయితే, అర్జున్ విషయంలో కుటుంబం పూర్తి గోప్యతను పాటిస్తోంది. అతడి ఫోటోలు నెట్టింట ఎక్కడా కనిపించవు. సెలబ్రిటీ కుటుంబానికి చెందినవారైనా, సోషల్ మీడియాలో లేదా పబ్లిక్ ఈవెంట్స్‌లో అర్జున్ కనిపించకపోవడం విశేషం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో చిన్నపిల్లవాడిగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన అర్జున్, ఆ తర్వాత మళ్లీ కెమెరాకు చిక్కలేదు. అప్పటికి అతడి వయసు దాదాపు పది సంవత్సరాలుండొచ్చని చెప్పుకుంటారు.

సాధారణంగా స్టార్ ఫ్యామిలీలకు చెందిన యువత ఫోటోలు ఏదో రూపంలో లీక్ అవుతుంటాయి. కానీ అర్జున్ మాత్రం అందుకు కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ప్రైవేట్ పర్సన్‌గా ఉండటం ఆసక్తికరంగా మారింది. అర్జున్ సినిమాల్లోకి వస్తాడా? రాడా? అనే ప్రశ్నకు కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వస్తాడని చెప్పరు.. రాడని కూడా ఖరారు చేయరు. అన్నీ గోప్యంగానే ఉంచుతున్నారు. అయితే, ఇంతకాలం దాచడం ఒక ఎత్తు అయితే, ఇకపై దాచడం మరో ఎత్తు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అర్జున్ 23–24 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత అయినా అతడి భవిష్యత్‌పై స్పష్టత రావాల్సిందేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటేష్ వయసు ఇప్పటికే 65 ఏళ్లు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు పూర్తయ్యాయి, తాతయ్యగా కూడా మారారు. ఆ కుటుంబంలో ఇప్పుడు చిన్నోడు అర్జున్ మాత్రమే. అతడికి నచ్చిన రంగం వైపు ప్రోత్సహిస్తే తండ్రిగా వెంకటేష్ బాధ్యత నెరవేరినట్లే అవుతుంది.