Minister Jagadish Reddy |
విధాత : సూర్యాపేట వాసులకు బోటింగ్ వసతి అందుబాటులోకి వచ్చింది. మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం చెందిన సద్దుల చెరువులో షికారు బోటును రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
బోటింగ్ వసతి ప్రారంభంతో సద్దుల చెరువు పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడానికి తొలి అడుగు పడ్డట్లయింది.
బోటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. శుభాకార్యాలు జరుపుకునేందుకు వీలుగా త్వరలో మినీ కృయిజ్ షిప్, ఫైబర్ జెట్ లను కూడా ఏర్పాటు చేసునున్నట్లు తెలిపారు.
సూర్యాపేట పట్టణవాసులు, నియోజకవర్గ ప్రజలు బోటింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని అహ్లాదాన్ని పొందాలన్నారు.