Telangana | 5,204 నర్సు పోస్టులకు ఆన్‌లైన్‌లోనే రాతపరీక్షలు: మంత్రి హరీశ్‌రావు
Telangana | తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆయా రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,204 నర్సు పోస్టులకు ఆన్‌లైన్ ద్వారానే రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మేరకే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 5,204 పోస్టులకు గానూ 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, […]

Telangana |
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆయా రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,204 నర్సు పోస్టులకు ఆన్‌లైన్ ద్వారానే రాతపరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం మేరకే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
5,204 పోస్టులకు గానూ 40,936 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని మంత్రి సూచించారు. నర్సు పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు హరీశ్‌రావు.