Minister Jagdish Reddy | తెలంగాణపై అక్కసు వెళ్లగక్కిన మోదీ: మంత్రి జగదీష్‌రెడ్డి
Minister Jagdish Reddy రాహుల్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే దేశం నాశనానికి కారకులు వీరే. విధాత, ప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభలో మరోసారి తెలంగాణ రాష్ట్రంపై తమ అక్కసు వెళ్లగక్కారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మరోసారి తెలంగాణ మీద, సిఎం కేసీఆర్ మీద […]
Minister Jagdish Reddy
- రాహుల్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే
- దేశం నాశనానికి కారకులు వీరే.
విధాత, ప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభలో మరోసారి తెలంగాణ రాష్ట్రంపై తమ అక్కసు వెళ్లగక్కారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సూర్యాపేట లో మీడియా తో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని హోదాలో ఉన్న మోడీ.. స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చెప్పారని విమర్శించారు.
మరోసారి తెలంగాణ మీద, సిఎం కేసీఆర్ మీద మోడీ తన అక్కసు వెళ్లగక్కారన్నారు. అవినీతిలో బిజెపి మోడీ పాలనలో కాంగ్రెస్ ని మించి పోయిందని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో జరిగిన అవినీతే బిజెపి పాలనకు సాక్ష్యం అన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుంది అనే భయం తోనే కేసీఆర్ కుటుంబంపై మోడీ అవాకులు, చెవాకులు పేలుతున్నారు.
రాఫెల్ కుంభకోణం, బ్యాంకులకు లక్షల కోట్లు టోకరా బెట్టిన బడా బాబులే మోడీ కుటుంబ సభ్యులని ఆరోపించారు .కొద్దిమంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు ప్రధాని మోదీ అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. చైతన్యవంతమైన వరంగల్ , తెలంగాణ ప్రజానీకం మోడీ అబద్ధాలు నమ్మరన్నారు .కేంద్రం సహా బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
దీని కారణంగా నే తెలంగాణ పై ముఖ్యమంత్రి కేసీఆర్ పై అబద్ధపు ప్రచారానికి మోడీ శ్రీకారం చుట్టరన్నారు. రాహుల్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే అన్న మంత్రి దేశం నాశనానికి కారకులు ఆ ఇద్దరే అన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి.. ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి సర్కార్ పని అన్నారు.తెలంగాణ లో.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల మనసులో స్థానం లేదన్నారు. బిజెపి దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram