గోదావరి జలాల దోపిడీపై ఏపీ కన్ను..సీఎం రేవంత్ మౌనం : హరీశ్ రావు ధ్వజం
తెలంగాణకు హక్కుగా రావాల్సిన గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం దోపిడీకి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనం ఎందుకని ప్రశ్నించారు.
విధాత, హైదారాబాద్ : తెలంగాణకు హక్కుగా రావాల్సిన గోదావరి జలాలను దోపిడీకి ఏపీ ప్రభుత్వం కన్ను వేసిందని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో తెలంగాణకు కృష్ణా,గోదావరి జలాల సాధనలో తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నది జలాల సాధనలో తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని, చేస్తున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు గళం ఎత్తుతున్నామని, దానిపై పాత డేట్లతో కూడిన లేఖలతో ప్రభుత్వం వివరణలు ఇవ్వడం రివాజుగా మారిపోయిందన్నారు. జనవరి 30న ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ నది జలాల హక్కులను హరించి గోదావరి జలాలను తన్నుకునే ప్రయత్నం చేసిందన్నారు. తెలంగాణ అధికారులు రాష్ట్రానికి నష్టం చేసేలా తలలూపారని ఆరోపించారు.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తన పరిధి ధాటి ఇప్పటివరకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీనే జరగలేదని చెప్పిందని, ఈ విషయం జనవరి 30న జరిగిన మినిట్స్ లో చెప్పారు అని హరీశ్ రావు గుర్తు చేశారు. తెలంగాణ అన్యాయం జరిగే రీతిలో ఉన్న ఈ మినిట్స్ ఫిబ్రవరి 12న రాష్ట్రానికి అందితే ఇప్పటిదాక కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ అండ చూసుకొని ఏపీ ప్రభుత్వం రెచ్చిపోతుంది అని, తమ ఏజెంట్ రేవంత్ తెలంగాణలో ఉన్నాడనే ఇలా చేస్తుందని హరీశ్ రావు ఆరోపించారు. నల్లమల సాగర్ అంశం ఉంటే మీటింగ్ కు వెళ్లమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్దంగా అజెండాలో మొదటి అంశంగా నల్లమల సాగర్ ఉన్నప్పటికి మీటింగ్ కు వెళ్లడం విస్మయకరం అని హరీశ్ రావు విమర్శించారు. ఏపీకి చెందిన ఆధిత్యనాధ్ దాస్ ను పెట్టుకుని తెలంగాణ నది జలాల హక్కులను ఏపీకి ధారదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
ట్రిబ్యూనల్ కే చట్టబద్దత లేదని జీఆర్ఎంబీ అంటుందని, అలాంటప్పుడు నీటి కేటాయింపులు లేకపోతే 76ప్రాజెక్టులకు అనుమతులు ఎలా ఇచ్చిందని హరీష్ రావు నిలదీశారు. బచావత్ ట్రిబ్యూనల్ కేటాయింపులు చేసినందునే సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యూనల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని,తెలంగాణ నీటీ హక్కులను కాలరాయడమే అని ఆరోపించారు. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీతారామా ప్రాజెక్టు అనుమతుల సందర్బంగా ఏపీకి డౌన్ స్ట్రీమ్ కింద 531 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ పేర్కొందని, తెలంగాణకు అప్పటికే బచావత్ ట్రిబ్యూనల్ 968టీఎంసీలు కేటాయించిందని హరీష్ రావు తెలిపారు.
జీఆర్ఎంబీ అనేది సీడబ్ల్యూసీ లో ఒక భాగమే కదా అని హరీశ్ రావు గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ తెలంగాణకు 2023 జూన్ లో గోదావరిలో 12 సబ్ బేసిన్ల వారిగా 3,390 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1470టీఎంసీలు, ఏపీకి 531 అని చెప్పిందని, మిగిలిన 960 టీఎంసీల నీళ్లు తెలంగాణవే అని తేల్చిందన్నారు. ఏపీ ఇప్పుడు మాకు గోదావరి నీళ్లలో 531టీఎంసీలు కాదు 775టీఎంసీలు అని వాదిస్తుందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం మాట్లాడటం లేదు అన్నారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు అని, బీఆర్ఎస్ పోరాడి అనుమతులు వచ్చిన తర్వాత కూడా వాడిని అడ్డుకోవాలని చూశారు అని హరీశ్ రావు ఆరోపించారు. కృష్ణా ట్రిబ్యునల్ సాధించి నదీ జలాల పంపిణీకి కేసీఆర్ కృషి చేశారు అని, నీటి హక్కులను కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టారు అని, కాంగ్రెస్ వచ్చాక కృష్ణ, గోదావరి జిల్లాలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 4.50కోట్లు జీతాలకు ఖర్చు చేశామని, మేం టెలిమెట్రీలు పెట్టలేమంటూ కేఆర్ఎంబీ చెబితే ఎందుకు స్పందించడం లేదని, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ వచ్చేదాక ఏపీ జల దోపిడిని భరించాలా అని..అప్పటిదాక రేవంత్ ప్రభుత్వం స్పందించదా అని హరీశ్ రావు నిలదీశారు.
ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్ పనులు వేగంగా సాగుతున్నాయని, గోదావరి జలాలను రాష్ట్రానికి తరలిస్తామని చెబితే..తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో దానిని అడ్డుకుంటామని ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేర్కొనలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. 80శాతం కృష్ట నీళ్లను ఏపీ తీసుకెళ్లిందని, ఇటు గోదావరి జలాల్లో ఏపీ దోపిడీకి సిద్ధమైందని ఆరోపించారు. మేం బీఆర్ఎస్ పాలనలో గోదావరిపై ఏడు ప్రాజెక్టులకు 400టీఎంసీలకు అనుమతులు తెస్తే..మీరు ఒక్క టీఎంసీకి తేకపోగా ఉన్నవి పోగొడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పటికైన సీఎం రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి జనవరి 30 మినిట్స్ ను ఖండిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Nandini Sidda Reddy : నందిని సిధా రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
భారత్ కు తీరనున్న ఎల్పీజీ గ్యాస్ తిప్పలు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram