గంగవ్వను కలవడం ఆనందంగా ఉంది.. కేటీఆర్
విధాత: యూట్యూబ్ స్టార్ గంగవ్వను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన కళోత్సవాల ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఈ సభకు గంగవ్వ కూడా హాజరవగా కేటీఆర్ గంగవ్వను ఆప్యాయంగా పలుకరించారు. ఆమెను కేటీఆర్ ఆత్మీయ ఆలింగం చేసుకున్న ఫోటోను కొణతం దిలీప్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఎంతో పాపులారిటీ […]

విధాత: యూట్యూబ్ స్టార్ గంగవ్వను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో జరిగిన కళోత్సవాల ముగింపు సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
అయితే ఈ సభకు గంగవ్వ కూడా హాజరవగా కేటీఆర్ గంగవ్వను ఆప్యాయంగా పలుకరించారు. ఆమెను కేటీఆర్ ఆత్మీయ ఆలింగం చేసుకున్న ఫోటోను కొణతం దిలీప్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పక్కా లోకల్ యూట్యూబ్ స్టార్ గంగవ్వను కలవడం ఎంతో ఆనందంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మై విలేజ్ షోకు అతిథిగా వీలైనంత త్వరలోనే వస్తానని గంగవ్వకు ప్రామిస్ చేశానని కేటీఆర్ తెలిపారు.