Minister Niranjan Reddy | ఇక పాలమూరు కష్టాలు తీరినట్లే: మంత్రి నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy | సీఎం కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతోనే అనుమతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విధాత, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడం తెలంగాణ ప్రజల విజయమని, సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు అనుమతులు వచ్చాయని, ఇక పాలమూరు జిల్లా వాసుల కరువు గోస తీరినట్లేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతుల నేపథ్యంలో స్పందించిన మంత్రి […]

Minister Niranjan Reddy | ఇక పాలమూరు కష్టాలు తీరినట్లే: మంత్రి నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy |

  • సీఎం కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతోనే అనుమతులు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

విధాత, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడం తెలంగాణ ప్రజల విజయమని, సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చేసిన ప్రయత్నాలతో ఎట్టకేలకు అనుమతులు వచ్చాయని, ఇక పాలమూరు జిల్లా వాసుల కరువు గోస తీరినట్లేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతుల నేపథ్యంలో స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతు అనుమతులపై హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల మీద సంబరాలు నిర్వహిస్తామన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల వద్ద వేలాది మంది రైతులతో సంబరాలకు పిలుపునిస్తున్నట్లుగా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలమవుతుందని, కేసీఆర్ సంకల్ప బలమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి కారణమన్నారు.

రాబోయే పదేళ్లలో పాలమూరు కోనసీమను మరిపిస్తుందన్నారు. హైదరాబాద్ నుండి అలంపూరు వరకు దారి పొడవునా పచ్చదనం పరుచుకుంటుందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విజయోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీల కుట్రతోనే అనుమతుల జాప్యం

పాలమూరు రంగారెడ్డి (Palamuru Ranga Reddy) ఎత్తిపోతలకు సకాలంలో గతంలోనే అనుమతులు వచ్చివుంటే రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందివుండేవన్నారు. ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయని మంత్రి పరోక్షంగా కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు చేశారు.

ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయినందునా త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామని, మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తామని, త్వరలో డ్రై రన్ కు సన్నాహాలు చేస్తున్నామని, నెలఖారుకు మొదటి పంపు ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ (Krishnamma) నీళ్లతో తడుపుతానని, మడి, మడిని తడుపుతానని మంత్రి శపథం చేశారు.

సీఎం కేసీఆర్ సుధీర్ఘ వ్యూహానికి, ముందుచూపుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతీక అని, ఆరుదశాబ్ధాల జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నదన్నారు. రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారని, త్వరలో వారి కల నెరవేరబోతుందన్నారు. ఇప్పటికే నార్లాపూర్ , ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పర్యావరణ అనుమతుల కోసం ఆగాయని, అవి కూడా రావడంతో పనులు వేగంగా పూర్తి చేయిస్తామన్నారు.

కాళేశ్వరం కంటే పెద్ద పంపులు

కాళేశ్వరం (Kaleswaram) పంపులను మించిన పంపులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం పంపుల సామర్థ్యం 139 మొగావాట్లుగా ఉంటే , పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుల సామర్థ్యం 145 మెగావాట్లని, ఒక మోటరు ఒక లక్ష 96,500 హార్స్ పవర్ తో రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా పని చేస్తాయన్నారు. నార్లాపూర్ ,అంజనగిరి రిజర్వాయర్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులు పనిచేస్తాయని, రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 11 కిలోమీటర్లు, ఎత్తు 60 మీటర్లు, 6.5 టీఎంసీల సామర్థ్యంగా ఉంటాయన్నారు.

తెలంగాణలో అత్యంత ఎత్తయిన రిజర్వాయర్‌గా ఉన్న ఏదుల 85 శాతం పనులు పూర్తయ్యాయని, ఏదుల వీరాంజనేయ ఆనకట్ట పొడవు 7.5 కిలోమీటర్లు, 6.55 టీఎంసీల సామర్థ్యమన్నారు. 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులు ఏదుల పంప్ హౌస్ లో ఉంటాయని, 24 నెలల రికార్డు సమయంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం జరిగిందని,1299 మంది ముంపు బాధితులను గుర్తించి రూ.205 కోట్ల పరిహారం అందజేశామన్నారు. 50 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యమన్నారు.

వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.23 కిలోమీటర్లు, లక్ష 39 వేల ఎకరాల ఆయకట్టుగా ఉందని, 145 మెగావాట్ల సామర్థ్యం గల 10 పంపులతో వట్టెం పంప్ హౌస్ నిర్మితమవుతుందని, కరివెన కురుమూర్తి రాయ రిజర్వాయర్ సామర్థ్యం 19 టీఎంసీలు, ఆనకట్ట పొడవు 15 కిలోమీటర్లు, లక్ష 50 వేల ఆయకట్టు, కాలువ పొడవు 110 కిలోమీటర్లుగా ఉందన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ఆనకట్ట పొడవు 15.8 కిలోమీటర్లు, 16.03 టీఎంసీల సామర్థ్యం, 9.36 లక్షల ఎకరాల ఆయకట్టుగా ఉందన్నారు.