Telangana | MLA కోటా MLC ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Telangana | తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 6వ తేదీన ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 23న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ మూడు […]

Telangana | తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 6వ తేదీన ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
మార్చి 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. మార్చి 23న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.