బీఆరెఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా

విధాత : బీఆరెస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆరెస్ అధిష్టానాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తనకు మల్కాజిగిరి టికెట్‌ను, తన కొడుకు రోహిత్‌కు మెదక్ టికెట్‌ను మైనంపల్లి కోరారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం హనుమంతరావుకు మాత్రం మల్కాజిగిరి టికెట్ ఇచ్చి , రోహిత్‌కు టికెట్ నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మైనంపల్లి మంత్రి టి.హరీశ్‌రావుపైన, పరోక్షంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌లపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన మైనంపల్లితో కాంగ్రెస్ పార్టీ నాయకులు టచ్‌లో ఉండటంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ
బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు నాకు ఇబ్బందికరంగా మారిన తరునంలో, పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ సీఎం కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ రాశారు.

మైనంపల్లి.. రాజకీయ నేపథ్యం
మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణీ రామాయంపేట శాసనసభా నియోజక వర్గం నుంచి 2004లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయారు.అనంతరం జరిగిన రామాయంపేట ఉప ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు పద్మా దేవేందర్ రెడ్డి పై పోటీ చేసి 10 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.2009 లో మెదక్ నియోజక వర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు టిడిపి టి అర్ ఎస్ అలయెన్స్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి శశిధర్ రెడ్డి పై 19 వేల పై చిలుక ఓట్లతో విజయం సాధించారు.

మైనంపల్లి కాంగ్రెస్ లోకి
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు త్వరలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తుంది.మెదక్ ,మేడ్చల్ ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి కేటాయిస్తున్నట్లు సమాచారం.