అక్రమ కేసులపై న్యాయ పోరాటం: ఎమ్మెల్యే పల్లా
ఎటువంటి ఆధారాలు లేకుండా నాపైన, నా భార్య పైన పోలీసులు అక్రమ కేసు బనాయించారని జనగామ బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

- అధారాలు లేకుండా కేసులా
విధాత, హైదరాబాద్ : ఎటువంటి ఆధారాలు లేకుండా నాపైన, నా భార్య పైన పోలీసులు అక్రమ కేసు బనాయించారని జనగామ బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తమపై నమోదు చేసిన పోలీసు కేసులపై ఆయన ట్వీటర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నేను గాని, నా భార్య గాని భూముల గురించి ఏనాడు ఎవరితో గొడవ పడలేదని..బెదిరించలేదని, ఎవరి భూములను ఆక్రమించలేదని స్పష్టం చేశారు.
కేసు పెట్టేటప్పుడు సంఘటన ఎక్కడ జరిగింది..ఎప్పుడు జరిగింది.. వివాదంలో ఎవరు ఉన్నారు.. ఆధారాలు ఏమిటనేవి కనీస బాధ్యతగా చూడకుండా కేసు నమోదు చేశారని పల్లా ఆక్షేపించారు. ఒకవేళ భూమికి సంబందించిన సమస్య అయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలని, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, చట్టం న్యాయం మీద నమ్మకం ఉందని, అన్ని రకాల పోరాటం కొనసాగుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.