నేనున్నా.. అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే పల్లా

ప్రజలకిచ్చిన హామీల నేపధ్యంలో జనగామ బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంతంగా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తుంది

  • By: Somu    latest    Jan 05, 2024 11:25 AM IST
నేనున్నా.. అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే పల్లా
  • నియోజకవర్గ ప్రజలందరికి ఉచిత వైద్యం
  • జనగామ ఎమ్మెల్యే పల్లా ఉదారత


విధాత : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా తనకు ప్రజాసంక్షేమానికి, అభివృద్ధి పనులకు అవకాశాలు తక్కువే ఉన్నప్పటికి ప్రజలకిచ్చిన హామీల నేపధ్యంలో జనగామ బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంతంగా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వం లేకపోయినా ఎవరూ అధైర్యపడొద్దంటూ జనగామ నియోజకవర్గం ప్రజలకు నేను ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసానిస్తూ వారికి ఖరీదైన కార్పోరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు.


జనగామ నియోజకవర్గం ప్రజలకు హైద్రాబాద్ ఘట్‌కేసర్‌లోని నీలిమ ఆసుపత్రిలో ఉచిత వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీంతో పలు రకాల అనారోగ సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం పెద్ద సంఖ్యలో నీలిమ ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య చికిత్సల సమాచారాన్ని పల్లా ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండటంతో పాటు స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తుండటంతో రోగులు మెరుగైన వైద్య సేవలతో త్వరగా కోలుకుంటున్నారు.


ఈ క్రమంలో శుక్రవారం పల్లా నీలిమ ఆసుపత్రికి వెళ్లి అందులో చికిత్స పొందుతున్న జనగామ ప్రజలను పరామార్శించి వారికి మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. తమకు పల్లా అందిస్తున్న ఉచిత వైద్య సేవల పట్ల జనగామ నియోజకవర్గ ప్రజల హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు.