MLA Seethakka | పోలీసులకు జీతాలు.. పువ్వాడ అజయ్ ఇస్తున్నాడా: ఎమ్మెల్యే సీతక్క
MLA Seethakka రాహుల్ సభకు వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మూలుగు ఎమ్మెల్యే సీతక్క విధాత : తెలంగాణలో పోలీసులకు జీతాలు పువ్వాడ అజయ్ ఇస్తున్నాడా అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. రాహుల్ సభకు వస్తున్న ప్రజలను చెక్ పోస్టులను పెట్టి అడ్డుకున్నారని సీతక్క ఆరోపించారు. నేడు ఖమ్మంలో రాహుల్ సభ నేపథ్యంలో సీతక్క మీడియా తో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశం కోసం, ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడన్నారు. తెలంగాణ […]
MLA Seethakka
- రాహుల్ సభకు వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారు
- ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.
- మూలుగు ఎమ్మెల్యే సీతక్క
విధాత : తెలంగాణలో పోలీసులకు జీతాలు పువ్వాడ అజయ్ ఇస్తున్నాడా అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. రాహుల్ సభకు వస్తున్న ప్రజలను చెక్ పోస్టులను పెట్టి అడ్డుకున్నారని సీతక్క ఆరోపించారు. నేడు ఖమ్మంలో రాహుల్ సభ నేపథ్యంలో సీతక్క మీడియా తో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశం కోసం, ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి ప్రజలను నిర్భందిస్తున్నారు. బస్సులు రాకుండా బస్సులనివ్వకుండా ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం ఇది అత్యంత హెయమైనా చర్య అన్నారు.
బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారు. ఉద్యోగులను ప్రైవేటు మీటింగ్ కు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కార్యకర్తలుగా ఉపయోగించుకొని ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని మా సభను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరుతున్నామని సీతక్క కోరారు. బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబద్ధార్ అని సీతక్క హెచ్చరించారు.
తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతంతో పోలీసులు డ్యూటీలు చేస్తున్నారన్నారు. మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి ఇస్తలేరని, అధికారులు నిష్పక్షపాతంగా, నీతిగా వ్యవహరించాలని అన్నారు. పోలీసులు ఒక పార్టీకి తోత్తులుగా మారి తమ పార్టీ మీటింగ్ ను విచ్చినం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు సీతక్క విజ్ఞప్తి చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram