Mobile Blast | టీ తాగుతుండగా.. జేబులో పేలిన సెల్‌ఫోన్ (Video)
Mobile Fire విధాత: చార్జింగ్ పెడుతుంటే లేదా చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుంటేనే, మాట్లాడుతుంటేనో సెల్‌ఫోన్ పేలి పోయిందని తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తే.. జేబులో సెల్‌ఫోన్ పెట్టుకోవడానికి కూడా భయపడటం గ్యారెంటీ. తిరువనంతపురంలో ఓ పెద్దాయన తాపీగా హోటల్‌లో కూర్చొని టీ తాగుతుండగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సదరు వ్యక్తి భయపడిపోయి.. ఫోన్‌ను బయట పడేసి.. మంటలార్పుకున్నాడు. మంట పెద్దగానే వచ్చినా.. […]
Mobile Fire
విధాత: చార్జింగ్ పెడుతుంటే లేదా చార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుంటేనే, మాట్లాడుతుంటేనో సెల్‌ఫోన్ పేలి పోయిందని తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తే.. జేబులో సెల్‌ఫోన్ పెట్టుకోవడానికి కూడా భయపడటం గ్యారెంటీ.
తిరువనంతపురంలో ఓ పెద్దాయన తాపీగా హోటల్‌లో కూర్చొని టీ తాగుతుండగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సదరు వ్యక్తి భయపడిపోయి.. ఫోన్‌ను బయట పడేసి.. మంటలార్పుకున్నాడు.
మంట పెద్దగానే వచ్చినా.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అసలే ఎండాకాలం.. ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి.. వేడిగా ఉన్నప్పుడు జేబులో మాత్రం పెట్టుకోకండి.. అని పలువురు నెటిజన్లు సలహాలు ఇచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram