వారివి డ్రామాలు.. KCR ఫోన్ చేసిన మరుక్షణమే మోదీ స్పందిస్తారు: రాహుల్ గాంధీ
విధాత: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటూ పని చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీలోని చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోకి భారత్ జోడో యాత్ర.. క్రికెట్ ఆడిన రాహుల్,రేవంత్ The words of true leaders […]
విధాత: తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు పరస్పరం సహకారం అందించుకుంటూ పని చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీలోని చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోకి భారత్ జోడో యాత్ర.. క్రికెట్ ఆడిన రాహుల్,రేవంత్
The words of true leaders are a rallying cry for those who seek change.#BharatJodoYatra pic.twitter.com/Pf0FGjWk2S
— Congress (@INCIndia) November 1, 2022
ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీని టీఆర్ఎస్ ఎన్నోసార్లు సమర్థించిందని తెలిపారు. ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫోన్ చేసిన మరుక్షణమే మోదీ స్పందిస్తారని పేర్కొన్నారు.
హైదరాబాద్ అడ్డా పై…
ఐకమత్య గర్జన…
జై బోలో – భారత్ జోడో#ManaTelanganaManaRahul #BharatJodoYatra#Day7 pic.twitter.com/lcMrTEQhFa— Revanth Reddy (@revanth_anumula) November 1, 2022
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పుడూ కూడా రైతులకు అండగా నిలవలేదన్నారు. రైతులకు ఈ రెండు పార్టీలు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదని మండిపడ్డారు. దేశంలో యువతకు ఉద్యోగాలు లభించట్లేదన్నారు. ఇంజినీరింగ్ చేసిన వాళ్లు స్విగ్గీలో పని చేస్తున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఎయిర్ పోర్టులు, టెలికాం, ఎల్ఐసీ లాంటి సంస్థలను మోదీ అమ్మేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు దృష్టి ఎప్పుడూ ధరణి పోర్టల్ మీద ఉంటుంది. ఆక్రమించడానికి భూములు ఎక్కడ ఉన్నాయో అని కేసీఆర్ చూస్తుంటారు.
రేవంత్‌కు బూస్ట్: TRSతో పొత్తు ప్రసక్తే లేదు.. పోరే: రాహుల్ గాంధీ
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత 55 రోజులుగా రాహుల్ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణలో కృష్ణా నది పరవళ్లు తొక్కినట్లు.. రాహుల్ పాదయాత్రలో ప్రజలంతా కదం కదం కలిపారు. చార్మినార్ ప్రాంతంలో దిక్కులు పిక్కటిల్లేలా రాహుల్ పాదయాత్రకు లక్షలాది మంది జనం కదిలి వచ్చారని తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన మల్లికార్జున్ ఖర్గేకు కూడా ఘన స్వాగతం లభించిందన్నారు. అత్యంత సామాన్యుడు ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడని ఖర్గేపై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
రణరంగంలా మారిన మునుగోడు.. రాళ్ల దాడి.. పరిస్ధితి ఉద్రిక్తం (వీడియో)
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram