Karimnagar | కరీంనగర్ జిల్లాలో దారుణం.. భూమి కోసం కనకవ్వ హత్య
Karimnagar | నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని భూమి కోసం చంపేశాడు కుమారుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండల పరిధిలోని రేణికుంటకు చెందిన తుమ్మనవేణి కనకవ్వ(56)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కనకవ్వ భర్త గతంలోనే మృతి చెందాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసింది కనకవ్వ. తమకున్న 1.20 ఎకరాల భూమిని కుమారుడు వినోద్ సాగు చేస్తున్నారు. అయితే కనకవ్వకు ఆమె […]
Karimnagar | నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని భూమి కోసం చంపేశాడు కుమారుడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండల పరిధిలోని రేణికుంటకు చెందిన తుమ్మనవేణి కనకవ్వ(56)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కనకవ్వ భర్త గతంలోనే మృతి చెందాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసింది కనకవ్వ. తమకున్న 1.20 ఎకరాల భూమిని కుమారుడు వినోద్ సాగు చేస్తున్నారు.
అయితే కనకవ్వకు ఆమె తండ్రి జంగంపల్లి శివారులో 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. ఆ భూమిని కనకవ్వ కౌలుకు ఇచ్చి.. వచ్చిన డబ్బుతో ఆమె బతుకుతోంది. ఆ భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయాలని తల్లితో వినోద్ గతేడాది నుంచి గొడవ పడుతున్నాడు. దీంతో కనకవ్వ వేరే ఇంట్లో కిరాయికి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్ బుధవారం జంగంపల్లి శివారులో ఉన్న భూమి వద్దకు వెళ్లి తల్లి పొలంలో వ్యవసాయ పనులు ప్రారంభించాడు.
విషయం తెలుసుకున్న కనకవ్వ అక్కడికి వెళ్లి వినోద్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో కనకవ్వ తలపై వినోద్ పారతో దాడి చేయడంతో.. తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కనకవ్వ చిన్న కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram