Dharmapuri Aravind | అభద్రతతోనే.. కేసీఆర్ ముందస్తు జాబితా: ఎంపీ ధర్మపురి అరవింద్
Dharmapuri Aravind | విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ గెలుపుపై అభద్రతా భావంతోనే సీఎం కేసీఆర్ ముందస్తుగా శాసనసభ అభ్యర్థుల జాబితా ప్రకటించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. జిల్లాకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అన్నారు. బుడబుక్కలతో కేటీఆర్ ను పొరపాటున సంబోధించానని, ఆ సమాజానికి క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని […]

Dharmapuri Aravind |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ గెలుపుపై అభద్రతా భావంతోనే సీఎం కేసీఆర్ ముందస్తుగా శాసనసభ అభ్యర్థుల జాబితా ప్రకటించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. జిల్లాకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అన్నారు. బుడబుక్కలతో కేటీఆర్ ను పొరపాటున సంబోధించానని, ఆ సమాజానికి క్షమాపణ కోరుతున్నానని అన్నారు.
ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడున్నర కోట్ల ఇండ్లు నిర్మించామని, మరో 50 లక్షలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. తెలంగాణ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఆశ చూపి మభ్యపెడుతోం దన్నారు. ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, కేవలం ముగ్గురు ముస్లింలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు.
14 శాతం ఓటర్లున్న ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దళితులకు 10 లక్షలు.. ముస్లింలకు ఒక లక్ష ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ముస్లింలు బీజేపీ కి ఓటు వద్దనుకుంటే.. నోటా కు వేయండి కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం వేయొద్దన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ తో ముస్లిం మైనార్టీలకే నష్టం జరుగుతుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఇప్పట్లో ఉండబోదని ఎంపీ స్పష్టం చేశారు.